బొగోటా: లైవ్‌లో ఉన్న యాంకర్‌పై టీవీ సెట్ పడింది. దీంతో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. మరోవైపు ఈ ఘటనతో కార్యక్రమంలో పాల్గొన్న గెస్ట్‌లు ఒక్కసారిగా షాకయ్యారు. కాగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ESPN కొలంబియాకు చెందిన యాంకర్ కార్లోస్ ఓర్డుజ్ బుధవారం రాత్రి లైవ్ షో నిర్వహిస్తున్నారు. కొంత మంది ప్యానలిస్టులతో ఆయన చర్చ జరుపుతున్నారు. ఇంతలో కార్లోస్ వెనుక ఉన్న పెద్ద టీవీ సెట్ మాదిరి వస్తువు ఆయనపై పడింది. దీంతో కార్లోస్ ముఖం టేబుల్‌కు ఒత్తుకోవడంతో స్వల్పంగా గాయపడ్డారు. కాగా లైవ్‌లో ఉండగా ఈ ఘటన జరిగింది. అందులో పాల్గొన్న హోస్ట్ ఒకరు దీనిని చూసి షాక్ అయ్యారు. మాట్లాడుతున్న ఆయన వెంటనే బ్రేక్‌కు పిలుపునిచ్చారు.
మరోవైపు ఈ వీడియోను మైక్ సింగ్టన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. పలువురు నెటిజన్లు, క్రీడా వ్యాఖ్యాతలు, పాత్రికేయులు స్పందించారు. కార్లోస్ ఓర్డుజ్కు ప్రమాదం తప్పడంపై ఊరట చెందారు. ఓర్డుజ్ కూడా తనకు పరామర్శలు తెలిపిన వారికి ట్విట్టర్లో కృతజ్ఞతలు చెప్పారు.
Shocking video. ESPN anchor crushed live on the air by falling set piece. Thankfully he was uninjured. pic.twitter.com/CeFxy8AksY
— Mike Sington (@MikeSington) March 10, 2021