ఒఎల్ఎక్స్ వస్తువుల విక్రయం పేరుతో సైబర్ మోసాలు
ఆన్లైన్ మారెట్ప్లేస్ల్లో పాత వస్తువులను విక్రయించే వారిని లక్ష్యంగా చేసుకుని, సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఒఎల్ఎక్స్ వంటి ఆన్లైన్ ప్లాట్ ఫామ్‌లలో వస్తువులను విక్రయించేందుకు ప్రకటనలు ఇచ్చేవారు అప్రమత్తంగా ఉండాలని మల్కాజిగిరి కమిషనర్ సుమతి ప్రజలకు సూచించారు.
- సోఫా కొంటామంటూ యువతికి రూ.12.20 లక్షల టోకరా
- సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి : మల్కాజిగిరి సీపీ సుమతి
సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ మారెట్ప్లేస్ల్లో పాత వస్తువులను విక్రయించే వారిని లక్ష్యంగా చేసుకుని, సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఒఎల్ఎక్స్ వంటి ఆన్లైన్ ప్లాట్ ఫామ్‌లలో వస్తువులను విక్రయించేందుకు ప్రకటనలు ఇచ్చేవారు అప్రమత్తంగా ఉండాలని మల్కాజిగిరి కమిషనర్ సుమతి ప్రజలకు సూచించారు. ఇటీవల ఓ యువతి తన పాత సోఫాను విక్రయించేందుకు ఒఎల్‌ఎక్స్‌లో ప్రకటన ఇవ్వగా, కొనుగోలుదారులుగా నటించిన సైబర్ నేరగాళ్లు ఆమెను సంప్రదించారు. సోఫా కొనుగోలు చేస్తామని నమ్మించి, తొలుత కొంత మొత్తాన్ని ఆమె ఖాతాకు పంపించి నమ్మకం కలిగించారు. అనంతరం డబ్బులు చెల్లించేందుకు, విక్రయించిన మొత్తాన్ని స్వీకరించేందుకు క్యూర్ కోడ్ సాన్ చేయాలని సూచించారు.
క్యూర్ కోడ్ సాన్ చేస్తే డబ్బులు జమ అవుతాయని నమ్మించి, యూపీఐ పిన్ నమోదు చేయించి ఆమె ఖాతా నుంచి నగదు మొత్తం ఖాళీ చేయడమే కాకుండా, ఆ డబ్బులు తిరిగి వస్తాయని, రెట్టింపు అవుతాయని నమ్మిస్తూ బ్యాంక్ వెరిఫికేషన్, రీఫండ్ ప్రాసెసింగ్, బ్లాక్ అయిన నగదు విడుదల తదితర కారణాలు చెబుతూ పలుమార్లు డబ్బులు వసూలు చేసి మోసగించినట్లు సీపీ వివరించారు. అంతేకాకుండా, పోలీసు అధికారులుగా సహా వివిధ వ్యక్తులుగా నటిస్తూ బాధితురాలిని ఫోన్ ద్వారా బెదిరించారని, పోలీసు చర్యలు తీసుకుంటామని భయపెట్టి మరిన్ని డబ్బులు వసూలు చేశారని సీపీ తెలిపారు. ఈ విధంగా బాధితురాలు మొత్తం రూ.12,20,822 నష్టపోయిందని వివరించారు. దీంతో జరిగిన మోసంపై బాధితురాలు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు.
ఆన్లైన్లో వస్తువులు విక్రయించేవారిని కొనుగోలుదారులుగా పరిచయం చేసుకుని, మొదట చిన్న మొత్తంలో డబ్బులు పంపించి నమ్మకం పొందడం, అనంతరం క్యూర్ కోడ్లు పంపించి సాన్ చేయించడం, యూపీఐ పిన్ నమోదు చేయించడం ద్వారా నగదు కాజేయడం సైబర్ నేరగాళ్ల ప్రధాన వ్యూహమని పోలీసులు తెలిపారు. రీఫండ్, బ్యాంక్ వెరిఫికేషన్, పేమెంట్ విడుదల, ప్రాసెసింగ్ ఛార్జీల పేరుతో అదనపు డబ్బులు డిమాండ్ చేస్తారని వివరించారు. ఇలాంటి అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

