నుపుర్ శర్మ అరెస్టు ఇప్పుడు కుదరదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: నుపుర్ శర్మకు సుప్రీంలో తాత్కాలిక ఊరట లభించింది. ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను ఇప్పుడు అరెస్టు చేయడం కుదరదు అని ఇవాళ సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ సూర్య కాంత్, జేబీ పర్దివాలాతో కూడిన ధర్మానం ఈ తీర్పునిచ్చింది. నుపుర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో దేశంలో పలు చోట్ల అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆమెపై అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఇక ఉదయ్పూర్లో నుపుర్ వ్యాఖ్యలను అనుకూలంగా పోస్టు చేసిన ఓ వ్యక్తిని ఇద్దరు ముస్లింలు దారుణంగా నరికి చంపిన విషయం తెలిసిందే. దేశంలో మతవిద్వేషాలు రగలడానికి నుపుర్ వ్యాఖ్యలే కారణమని ఇటీవల సుప్రీం అభిప్రాయపడిన విషయం కూడా తెలిసిందే. ఆగస్టు 10వ తేదీన మళ్లీ నుపుర్ శర్మ పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టనున్నది. నుపుర్పై వివిధ ప్రాంతాల్లో నమోదు అయిన ఎఫ్ఐఆర్లను రద్దు చేసే రీతిలో ఆమె హైకోర్టును ఆశ్రయించేందుకు దారుల్ని వెతుకుతామని కోర్టు తెలిపింది. నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలని గతంలో సుప్రీం పేర్కొన్న విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

