కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ‘వెలుగు’ దినపత్రిక తప్పుడు కథనాన్ని ప్రచురించిందని జర్మనీలోని హంబర్గ్ ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ విభాగం తీవ్రంగా ఖండించింది.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ‘వెలుగు’ దినపత్రిక తప్పుడు కథనాన్ని ప్రచురించిందని జర్మనీలోని హంబర్గ్ ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ విభాగం తీవ్రంగా ఖండించింది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేసింది. అక్టోబర్ 17న మొదటి పేజీలో ప్రచురించిన ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’ కథనాన్ని వెంటనే ఉపసంహరించుకొని, 24 గంటల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
ఈ మేరకు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సోమ భరత్ కుమార్ జారీ చేసిన నోటీసులకు హంబర్గ్ బీఆర్ఎస్ విభాగం పూర్తి మద్దతు ప్రకటించింది. సాగునీటి ప్రాజెక్టులపై అధికారిక ఆధారాలు లేకుండా, రాజకీయ దురుద్దేశంతో కథనాన్ని ప్రచురించారని ఆరోపించింది.
యాదాద్రి భువనగిరి జిల్లా సాగునీటి అవసరాలు, కొండపోచమ్మ సాగర్, కాలువల మార్గాలను కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంతో ముడిపెడుతూ ఎలాంటి అధికారిక ఆధారాలు లేకుండా వార్త ప్రచురించడం సరికాదని హంబర్గ్ బీఆర్ఎస్ ప్రతినిధులు పేర్కొన్నారు. సాగునీటి శాఖ రికార్డులను పరిశీలించకుండా, సంబంధిత అధికారుల వివరణ తీసుకోకుండా సంచలనం కోసమే ఈ కథనాన్ని ప్రచురించారని విమర్శించారు.
మూడు ప్రధాన డిమాండ్లు
వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని హంబర్గ్ బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. క్షమాపణను ‘వెలుగు’ దినపత్రిక మొదటి పేజీలో తగిన ప్రాధాన్యతతో ప్రచురించాలని, పత్రిక డిజిటల్ వేదికలు, అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లోనూ వెల్లడించాలని కోరింది. నోటీసుల్లో పేర్కొన్న గడువులోగా స్పందించకపోతే చట్టప్రకారం పరువు నష్టం దావా వేసి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
సాగునీటి ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారాన్ని సహించేది లేదు
కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని చూసి ఓర్వలేకనే రాజకీయంగా బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని హంబర్గ్ బీఆర్ఎస్ సభ్యులు ఆరోపించారు. విదేశాల్లో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ శ్రేణులు ఇటువంటి ప్రయత్నాలను ఉపేక్షించబోవని స్పష్టం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

