Tea | ఎంబీయేలు చదివి మరీ టీ మాస్టార్లు అవుతున్నారు.. అది ఛాయ్ గొప్పదనం !!
Tea | ఎదిగొచ్చిన కొడుకు బలాదూర్‌గా తిరుగుతుంటే తండ్రికి కోపం రావడం సహజం. అది కాస్తా నషాళానికి అంటినట్లయితే తిట్ల దండకం అందుకోవడం పేరెంట్స్ పేటెంట్ రైట్! అదే సమయంలో ‘తిండి దండగని నాన్న అంటే.. టేకిటీజీ పాలసీ’గా తీసుకోవడం పుత్రరత్నాల జన్మహక్కు!
Tea | ఎదిగొచ్చిన కొడుకు బలాదూర్‌గా తిరుగుతుంటే తండ్రికి కోపం రావడం సహజం. అది కాస్తా నషాళానికి అంటినట్లయితే తిట్ల దండకం అందుకోవడం పేరెంట్స్ పేటెంట్ రైట్! అదే సమయంలో ‘తిండి దండగని నాన్న అంటే.. టేకిటీజీ పాలసీ’గా తీసుకోవడం పుత్రరత్నాల జన్మహక్కు! ఆ ఆవేశంలో ‘టీ అమ్ముకొని బతుకు ఫో’ అని పితృదేవుడు గద్దించాడా జీ హుజూర్ అనేయండి! అప్పటివరకు తిట్టిన తిట్టుకో వంద చొప్పున పెట్టుబడిగా ఓ పదివేలు ఇవ్వమనండి చాలు! మీ దశ తిరిగిపోతుంది. మన దేశంలో 84 శాతం కుటుంబాలు ఉష్ణోదక వినియోగులే అని గుర్తుంచుకోండి!
ఏకాక్షరి విక్రయ విపణి ఇంత బలమైనది కాబట్టే.. పూటకో టీ కొట్టు పుట్టుకొచ్చినా జరుగుబాటుకు ఢోకా లేదని నిరూపితమవుతున్నది. అందుకే కాబోలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎమ్) వంటి ప్రతిష్ఠాత్మక విద్యాలయాల్లో వాణిజ్య సూత్రాలు ఒంటబట్టించుకున్న పట్టభద్రులు సైతం వీధి మలుపులో టీ పాయింట్ పెట్టడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు. కొందరైతే.. బహుళ జాతి సంస్థల్లో కష్టపడి సాధించిన కొలువు సైతం వదులుకొని టీ మాస్టార్లు అయిపోతున్నారు. ఎంబీయే మధ్యలో వదిలేసి, ఎనిమిదివేల రూపాయల పెట్టుబడితో ‘ఎంబీయే చాయ్‌వాలా’ పేరుతో చాయ్ దుకాణం పెట్టిన ప్రఫుల్ బిల్లోరి ఇప్పుడు ఏడాదికి రూ.4 కోట్ల టర్నోవర్ సాధించాడు. చాయ్ పాయింట్, టీ బాక్స్, ద చాయ్‌వాలా, చాయోస్ తదితర ఫ్రాంచైజీలన్నీ వేల పెట్టుబడితో మొదలై.. లక్షలు కొల్లగొట్టి.. కోట్లకు పడగలెత్తినవే! ఏతావాతా చెప్పొచ్చేది ఏంటంటే.. పెద్దల తిట్లు కూడా దీవెనలే అని భావించి, టీ కొట్టు తిట్టు విషయంలో పితృవాక్య పరిపాలన గావిస్తే.. తేనీటి విక్రేతలుగా జగత్ విఖ్యాతి పొందవచ్చు.
పుదీనా-అల్లం కోల్డ్ టీ
కావలసినవి: గ్రీన్ టీ పొడి: ఒక టీ స్పూన్, నీళ్లు: ఒక గ్లాస్, తేనె: ఒక టేబుల్ స్పూన్, అల్లం తురుము: పావు టీ స్పూన్, పుదీనా: నాలుగు ఆకులు, ఐస్ క్యూబ్స్: రెండు.
తయారీ: ముందుగా గిన్నెలో నీళ్లు పోసి బాగా మరిగించాలి. టీ పొడి వేసి మరో నిమిషం మసలనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. టీ చల్లారే లోపు ఒక గ్లాస్లో తేనె, అల్లం, పుదీనా వేసుకొని ఉంచాలి. చల్లారిన గ్రీన్ టీని గ్లాస్‌లోకి వడకట్టుకోవాలి. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకుంటే కోల్డ్ టీ సిద్ధం.
‘టీ’కా తాత్పర్యం
తేనీరు ఎక్కడ ఉంటుందో.. అక్కడ నమ్మకం ఉంటుంది.
ఆంగ్ల రచయిత వింగ్ పినేరో
Read More :
“Tea | ఎంత ఇష్టమైనా రోజులో 4 సార్లకంటే ఎక్కువ తాగకపోతేనే మేలు”
“Tea | విషం తిన్న వ్యక్తిని కాపాడిన ఛాయ్.. ఎక్స్పైరీ అయిన టీపొడి కూడా ఆరోగ్యమే !”
Bostan Tea Party | అమెరికాకు స్వాతంత్య్రం రావడానికి టీనే కారణమని తెలుసా
Tea History | వాళ్లే చాలా తెలివిగా మనకు ఛాయ్‌ను అలవాటు చేశారు !!
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Chai
- MBA Chaiwala
- tea
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

