Antique Photo Frames | పాత ఫొటోలు, పెయింటింగ్స్‌ను ఇలా కొత్తగా మార్చేసుకోండి
Antique Style God Photo Frames | కాలగర్భంలో కలిసిపోయి కనుమరుగైపోతున్న దేవతామూర్తుల చిత్రాలను ‘యాంటిక్ స్టైల్ గాడ్ ఫొటో ఫ్రేమ్స్' పేరిట అందుబాటులోకి తీసుకొస్తున్నాయి వివిధ సంస్థలు. అంటే, పాత చిత్రానికి కొత్త ఫ్రేము కట్టి అందిస్తున్నాయన్నమాట!
Antique Style God Photo Frames | మనకు కొన్ని చిత్రాల మీద ఎంతో ప్రేమ ఉంటుంది. ముఖ్యంగా, ఇంటి గోడకు ఏళ్ల తరబడి వేలాడిన తాతల కాలం నాటి దేవతా మూర్తుల పెయింటింగ్స్ అంటే మరింత మక్కువ. అవి పెద్దల జ్ఞాపకాలుగా అనిపిస్తాయి. కానీ, పేపర్ మీద ముద్రించిన చిత్రాలు ఎంత ఫ్రేమ్ కట్టినా కలకాలం నిలిచి ఉండవు. అలా కాలగర్భంలో కలిసిపోయి కనుమరుగైపోతున్న దేవతామూర్తుల చిత్రాలను ‘యాంటిక్ స్టైల్ గాడ్ ఫొటో ఫ్రేమ్స్’ పేరిట అందుబాటులోకి తీసుకొస్తున్నాయి వివిధ సంస్థలు. అంటే, పాత చిత్రానికి కొత్త ఫ్రేము కట్టి అందిస్తున్నాయన్నమాట!

ఇప్పుడు రూటు మారింది. జనం అల్ట్రా ఫ్యాషన్‌ను ఎంత ఇష్టపడుతున్నారో యాంటిక్ లుక్‌నూ అంతే ప్రేమిస్తున్నారు. కొత్త డిజైన్లను ఎంతగా ఆదరిస్తున్నారో సనాతన ఆచారాల మీదా అంతే శ్రద్ధ పెడుతున్నారు. యాంటిక్ జువెలరీ, యాంటిక్ సామగ్రి, రిట్రో లుక్… ఇలా ఇప్పటి వాళ్లకు పాత వాటిమీద కొత్త ప్రేమ మొదలైంది. ఆ కాలానిది అనేలా ఏది కనిపించినా
చటుక్కున సొంతం చేసుకుంటున్నారు. ఆ విషయాన్ని గ్రహించిన వివిధ సంస్థలు తమ ఉత్పత్తులను వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లు తీర్చిదిద్దుతున్నాయి. అందులో భాగమే మార్కెట్లోకి వస్తున్నవే దేవతా మూర్తుల యాంటిక్ ఫొటోఫ్రేమ్స్.

ఎన్నో చిత్రాలు
గరుత్మంతుడి మీద శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీహరి ఆసీనుడై ఉండే చిత్రం పాతతరం వారికి ఎంతో ప్రీతిదాయకం. ఇలా ఎగురుతున్న పక్షి మీద విష్ణుమూర్తి కూర్చున్న ఫొటో ఇంట్లో పెట్టుకుంటే సకల భయాలూ దూరమవుతాయని పెద్దలు చెబుతారు. అయితే, ఈ తరహా బొమ్మల్లో అత్యధిక ప్రాచుర్యం పొందింది రవివర్మ గీసిన గరుడగమనుడి చిత్రమే. అప్పట్లో చాలా మంది ఇళ్లలో పూజలందుకున్న ఈ చిత్రపటం ఇప్పుడు కనిపించడమే అరుదైపోయింది. హరిస్టోర్, ఎట్సీ లాంటి ఆన్లైన్ సంస్థలు ఇలాంటి వాటిని విక్రయిస్తున్నాయి. నీళ్ల మధ్య తామరపువ్వులో పద్మాసనంలో కనువిందు చేసే లక్ష్మీదేవి, సింహాసనంలో వయ్యారంగా కూర్చుని వెన్నముద్దలు తింటున్న చిన్ని కృష్ణుడు, తన్మయత్వంతో రామభజన చేసే హనుమంతుడిలాంటి చిత్రాలు ఇందులో ఉంటున్నాయి. అంతేకాదు సపరివారంగా పట్టాభిషిక్తుడైన రామభద్రుడి పురాతన చిత్తరువు, నందిభృంగితో కలిసి కనిపించే పరమేశ్వరుడు… లాంటివీ యాంటిక్ ఫొటోఫ్రేముల్లో వస్తున్నాయి. వీటిని చూస్తుంటే మీకూ చిన్ననాటి జ్ఞాపకమేదైనా మదిలో మెదిలిందా… అయితే దాన్ని కళ్లముందు కనిపించేలా పెట్టుకోవడం ఏమంత కష్టంకాదు… ప్రయత్నించండి మరి!
Read More :
పాత ఫర్నీచర్‌ను అందంగా మార్చి అమ్మేస్తోంది.. హైదరాబాదీ అమ్మాయి ఆలోచన అదుర్స్”
“Bidri Work | ఎంత కాలమైనా తుప్పుపట్టని ఈ కళాకృతులను ఎలా తయారు చేస్తారంటే..”
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- ART
- arts
- Photo frames
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

