అమ్మాయిల తనువులపైనే అద్భుతమైన చిత్రాలు.. హైదరాబాదీ కళాకారిణి ఎందుకిలా చేస్తుంది?
Abhijna Vemuru | స్త్రీమూర్తిని తనదైన కళతో సరికొత్తగా చూపిస్తున్నది అభిజ్ఞ. ఆమెకు తనువులే క్యాన్వాస్లు. స్వేచ్ఛాయుత స్వప్నాలే పంచరంగులు. ఆమె కుంచె సందేశాత్మకంగా రంగులద్దిన దేహాలు.. మనతో మాట్లాడుతాయి. ప్రతి చిత్రంలోనూ ఓ ఉద్వేగం తొంగిచూస్తుంది. ఈ హైదరాబాదీ చిత్రకారిణి అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్నట్టు ‘అభిజ్ఞ’ వర్గాల భోగట్టా!

కళాకారులకు పరిమితులు ఉండవని మరోసారి నిరూపించింది హైదరాబాద్‌కు చెందిన అభిజ్ఞ వేమూరు కాసా. తనువులే కాన్వాస్‌గా స్త్రీవాద భావాలను స్వేచ్ఛగా ప్రకటిస్తున్నది అభిజ్ఞ. పురాణాల్లోని స్త్రీమూర్తులు మొదలు ఆధునిక స్త్రీల వరకూ ప్రతి మగువా ఆమె అభివ్యక్తికి ఒక వస్తువే. తరాల సంప్రదాయాన్ని గౌరవిస్తూనే.. స్త్రీని వంటింటికి పరిమితం చేసే మూఢనమ్మకాలను ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.

తనువును క్యాన్వాస్గా మలుచుకొని తన వాణిని వినిపిస్తూ.. కాదేదీ కళకు అనర్హం అంటున్నది అభిజ్ఞ. పురాణాలు, జానపద కథలు, చరిత్రలోని స్త్రీ పాత్రలను, సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును పొందినవారి జీవనయానాన్నీ చిత్రకళ ద్వారా బంధిస్తున్నది. ఇందుకోసం సహజమైన రంగులను మాత్రమే ఉపయోగిస్తున్నది. అభిజ్ఞ గీసే ప్రతి చిత్రం స్త్రీవాదానికి సంబంధించి ఏదో ఒక సందేశాన్ని చాటుతుంది. అభిజ్ఞ చిత్రకళకు మెడ, చేతులు, వీపు, ముఖ భాగాలే కీలకం. వాటితోనే పదునైన సందేశం ఉంటుంది. ఓ వ్యక్తి జీవిత కథ వినిపిస్తుంది. ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చికాగోలో అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన అభిజ్ఞ.. ఆ తర్వాత లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్‌లో పట్టా అందుకుంది. తన కళను సరికొత్తగా ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో ‘బాడీ ఆర్ట్’ను అస్త్రంగా మలుచుకున్నది. పెండ్లి తర్వాత కళాకారిణిగా ఆమె మరింత పురోగతి సాధించింది. ఓ తల్లిగా మాతృత్వపు భావాలను కూడా తనదైన శైలిలో వ్యక్తపరుస్తున్నది అభిజ్ఞ.

…✍రవికుమార్ తోటపల్లి ( డప్పు రవి )
Read More :
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- ART
- inspiration
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Yadagirigutta | యాదగిరిగుట్టలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Siddharth Galla | కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేశ్ బాబు మేనల్లుడు.. వైరల్ అవుతున్న సిద్ధార్థ్ గల్లా వెడ్డింగ్ ఫొటోలు!
Niharika Konidela | కుందనపు బొమ్మలా మెరిసిన మెగా డాటర్.. నిహారిక ఫొటోలు వైరల్
MK Stalin | రాహుల్ గాంధీ ట్వీట్‌కు ధీటైన సమాధానమిచ్చిన తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్
Rishab Shetty | రిషబ్ శెట్టి, నాగవంశీ కాంబినేషన్లో కొత్త సినిమా.. ‘మోటార్‌సైకిల్ డైరీస్’ ప్రీ లుక్ పోస్టర్ అదిరిపోయిందిగా!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

