ప్రస్తుతం ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన పత్రంగా తయారైంది. ప్రతీ విషయానికి ఆధార్‌తో లింక్ పెట్టడంతో దీనికి ప్రాధాన్యం పెరిగింది. అయితే, ఆధార్ తీసుకున్న సమయంలో ఇచ్చిన సమాచారం మేరకు కార్డు జారీ చేయడంతో.. ప్రతి ఒక్కరికీ కార్డులో మార్పులు చేసుకోవడం అనివార్యమైంది.
ఆధార్ కార్డులో పేరు, చిరునామా, ఫోన్ నంబర్లను ఒక యాప్ సాయంతో మార్చుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌ను ప్రభుత్వం తయారుచేసి ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. ఈ యాప్ యూఐఏడీఐ చే అభివృద్ధి చేయబడింది. ఆధార్ కార్డు వివరాలను సేవ్ చేయడమే కాకుండా, ఈ యాప్ ద్వారా ఆధార్‌లో పాత విషయాలను మార్చుకునే వీలుంటుంది.
mAadhaar అనే యాప్‌ను ఉపయోగించడం ద్వారా ఆధార్‌లో మార్పులను సెకన్లలో పూర్తిచేసుకోవచ్చు. ఇంటి నుంచి mAadhaar యాప్‌ను ఉపయోగించి చిరునామా, ఫోన్ నంబర్‌ను ఎలా మార్చాలో తెలుసుకుందాం..
మొదట మీ స్మార్ట్‌ఫోన్‌లో mAadhaar అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఇది అందుబాటులో ఉన్నది.
mAadhaar యాప్‌ను ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే.. వెల్కమ్ టు mAadhaar అని స్మార్ట్‌ఫోన్ తెరపై కనిపిస్తుంది.
ఇక్కడ భాషను ఎంచుకోవాలి. తర్వాత మొబైల్ నంబర్‌ను నమోదు చేసి.. నెక్స్ట్ బటన్ నొక్కాలి.
మీరు ఇచ్చిన మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
ఇప్పుడు రిజిస్టర్ మై ఆధార్ పై క్లిక్ చేయడంతో మీ ఆధార్ యాప్‌లో నమోదవుతుంది.
4 అంకెల పిన్ నమోదు చేయగానే ధృవీకరించి.. ఆధార్ నంబర్ అడుగుతుంది.
అప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ నంబర్లో ఓటీపీ కనిపిస్తుంది.
దీన్ని నమోదు చేసిన తర్వాత ధృవీకరించగానే ఆధార్‌లో మార్పులు చేయాలనుకునే ఎంపికలు కనిపిస్తాయి.
చిరునామాను మార్చడానికి యాప్ దిగువన ఇచ్చిన నాలుగు ఎంపికలు.. సేవలు, మై ఆధార్ నమోదు కేంద్రం, మరిన్ని సేవలపై క్లిక్ చేయాలి.
ఆధార్ నంబర్‌ను నమోదు చేసిన తరువాత, సెక్యూరిటీ క్యాప్చాను ఎంటర్ చేసి ఓటీపీ రిక్వెస్ట్ పెట్టాలి.
రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేయాలి.
దీని తరువాత చిరునామాను ఎలా అప్డేట్ చేయాలో అడుగుతుంది.
దీని కోసం అడ్రస్ ప్రూఫ్ ద్వారా, సీక్రెట్ కోడ్ ద్వారా సెలక్షన్ అందుబాటులో ఉంటుంది.
అడ్రస్ ప్రూఫ్ ద్వారా బటన్ నొక్కి.. చిరునామా వివరాలను పూరించాలి.
ఏదైనా పొరపాటు జరుగుతుందో లేదో చూడటానికి దాన్ని ప్రివ్యూ చేసుకోవచ్చు.
అప్పుడు అడ్రస్ ప్రూఫ్‌ను స్కాన్ చేసి సమర్పించి ధృవీకరించు బటన్ పై క్లిక్ చేయాలి.
కొద్ది రోజుల్లోనే మీ చిరునామా మారిపోయి కొత్త ఆధార్ కార్డు వస్తుంది.
మొబైల్ నంబర్ మార్పు ఎంపికను ఎంచుకోవడానికి ఇక్కడ కొన్ని ఆప్షన్లను పొందుతారు.
ఇక్కడ వివరాలను పూరించి.. ఏది అప్డేట్ చేయాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత మొబైల్ నంబర్‌ను ఎంచుకుని సమర్పించాలి.
ఇప్పుడు మీ పాత నెంబర్ స్థానంలో కొత్త నంబర్ రిజిస్టర్ అవుతుంది.
ఆ దేశం అమ్మాయిలను వివాహమాడటంపై సౌదీ నిషేధం..!
ఆస్ట్రేలియాలో వరదలు.. 100 ఏండ్ల రికార్డు బద్దలు
భక్తులకు శుభవార్త : రెండేండ్ల తర్వాత అమర్నాథ్ యాత్ర
ఆస్కార్ నామినేషన్స్.. అడాప్టెడ్ స్క్రీన్ ప్లే రేసులో ‘ది వైట్ టైగర్’
చైనా వ్యాక్సిన్‌ను తిరస్కరిస్తున్న తైవాన్ ప్రజలు.. ఎందుకంటే..?
బెంగాల్, అసోం ఎన్నికల బరిలో జేడీయూ
109 ఏండ్ల రాష్ట్రంగా బిహార్.. చరిత్రలో ఈరోజు
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.