ఆ దేశం అమ్మాయిలను వివాహమాడటంపై సౌదీ నిషేధం..!
ఇప్పుడు పాకిస్తాన్ మహిళలు సౌదీ అరేబియాకు చెందిన షేక్‌లను వివాహం చేసుకోలేరు. సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ పెండ్లిళ్లపై నిషేధం విధించింది.అలాగే, సౌదీ అరేబియా పౌరులు బంగ్లాదేశ్, చాడ్, మయన్మార్ దేశాలకు చెందిన మహిళలను వివాహం చేసుకోవడాన్ని కూడా నిషేధించారు.

రియాద్: ఇప్పుడు పాకిస్తాన్ మహిళలు సౌదీ అరేబియాకు చెందిన షేక్‌లను వివాహం చేసుకోలేరు. సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ పెండ్లిళ్లపై నిషేధం విధించింది.అలాగే, సౌదీ అరేబియా పౌరులు బంగ్లాదేశ్, చాడ్, మయన్మార్ దేశాలకు చెందిన మహిళలను వివాహం చేసుకోవడాన్ని కూడా నిషేధించారు.
సౌదీ అరేబియా ప్రజలు ఇతర దేశాల మహిళలను వివాహం చేసుకోవటానికి ఇష్టపడతారు. వారు ఎక్కువగా పాకిస్తాన్, మయన్మార్ దేశాలకు చెందిన మహిళలను వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. ఒక అంచనా ప్రకారం, పాకిస్తాన్ సహా ఈ నాలుగు దేశాల నుంచి 5 లక్షలకు పైగా మహిళలు సౌదీ అరేబియాలో నివసిస్తున్నారు. సౌదీ అరేబియా మీడియా నుండి వచ్చిన నివేదికను ఉటంకిస్తూ పాకిస్తాన్ మీడియా ఈ సమాచారాన్ని ప్రచురించింది.
పాకిస్తాన్, బంగ్లాదేశ్, చాడ్, మయన్మార్ దేశాల మహిళలను వివాహం చేసుకోవడాన్ని సౌదీ అరేబియా నిషేధించినట్లు సౌదీ మీడియాలో ఒక నివేదికను ఉటంకిస్తూ పాకిస్తాన్‌కు చెందిన డాన్ పత్రిక నివేదించింది. అనధికారిక గణాంకాల ప్రకారం, ఈ నాలుగు దేశాల నుంచి సుమారు 5,00,000 మంది మహిళలు ప్రస్తుతం ఈ రాజ్యంలో నివసిస్తున్నారు.
విదేశీయులను వివాహం చేసుకోవాలనుకునే సౌదీ పురుషులు ఇప్పుడు కఠినమైన నిబంధనలను ఎదుర్కొంటున్నారని మక్కా పోలీసు డైరెక్టర్ మేజర్ జనరల్ అస్సాఫ్ అల్-ఖురాషిని ఉటంకిస్తూ మక్కా దినపత్రికలో ఒక వార్త ప్రచురితమైంది.
సౌదీ పురుషులు విదేశీయులను వివాహం చేసుకోకుండా నిరుత్సాహపరిచేందుకు ఉద్దేశించిన ఈ చర్య.. విదేశీయులతో వివాహానికి అనుమతి ఇచ్చే ముందు అదనపు ఫార్మాలిటీలను ఉంచినట్లు డాన్ పత్రిక నివేదించింది. విదేశీ మహిళలను వివాహం చేసుకోవాలనుకునే వారు మొదట ప్రభుత్వ అనుమతి తీసుకొని అధికారిక దరఖాస్తుల ద్వారా వివాహ దరఖాస్తులను సమర్పించాలని ఖురాషి పేర్కొన్నారు.
విడాకులు తీసుకున్న ఆరు నెలల్లోపు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించరని ఖురాషి చెప్పారు. దరఖాస్తుదారులు 25 ఏళ్లు పైబడి ఉండాలని, స్థానిక జిల్లా మేయర్ సంతకం చేసిన గుర్తింపు పత్రాలతో పాటు అతని కుటుంబ కార్డు కాపీతో పాటు అన్ని ఇతర గుర్తింపు పత్రాలను జతచేయాలని అధికారి తెలిపారు.
దరఖాస్తుదారుడు ఇప్పటికే వివాహం చేసుకున్నపక్షంలో తన భార్య వికలాంగురాలు అని, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నదని రుజువు చేసే దవాఖాన నివేదికను జతచేయాల్సి ఉంటుందని ఖురాషీ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
ఆస్ట్రేలియాలో వరదలు.. 100 ఏండ్ల రికార్డు బద్దలు
భక్తులకు శుభవార్త : రెండేండ్ల తర్వాత అమర్నాథ్ యాత్ర
ఆస్కార్ నామినేషన్స్.. అడాప్టెడ్ స్క్రీన్ ప్లే రేసులో ‘ది వైట్ టైగర్’
చైనా వ్యాక్సిన్‌ను తిరస్కరిస్తున్న తైవాన్ ప్రజలు.. ఎందుకంటే..?
బెంగాల్, అసోం ఎన్నికల బరిలో జేడీయూ
109 ఏండ్ల రాష్ట్రంగా బిహార్.. చరిత్రలో ఈరోజు
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
India vs Zimbabwe T20I | అమ్మాయిలు అదుర్స్.. దంచికొట్టిన షెఫాలీ, మంధాన.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

