కాళోజీ హెల్త్ యూనివర్సిటీ : యాజమాన్య కోటా బీహెచ్ఎంఎస్ సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రం లోని ప్రైవేట్ హోమియోపతి కళాశాలలోని యాజమాన్య కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ నెల 22వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. నీట్ -2021 అర్హత సాధించిన అభ్యర్థులు ఈ సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తరవాత దరఖాస్తుల పరిశీలన, ఆప్షన్ల నమోదుకు యూనివర్సిటీ మరో నోటిఫికేషన్ జారీచేస్తుంది.
మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్సైట్ www.knruhs.telangana.gov.in ను చూడాల్సిందిగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.