నోయిడా: యూపీలోని నోయిడా హౌజింగ్ సొసైటీలో ఓ మహిళతో స్థానిక బీజేపీ కార్యకర్త అనుచితంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ కేసులో యూపీ పోలీసులు రాజకీయవేత్త శ్రీకాంత్ త్యాగిని అరెస్టు చేశారు. నోయిడా సెక్టర్ 93బీలో నివసిస్తున్న ఓ మహళతో బీజేపీ నేత త్యాగి దురుసుగా ప్రవర్తించాడు. దుర్భాషలాడాడు. నోయిడా సెక్టార్లో అక్రమంగా సొసైటీ పార్క్‌ను కబ్జా చేసినందుకు ఆ మహిళ త్యాగిని నిలదీసింది. ఆ సమయంలో ఆ వ్యక్తి నోరుజారాడు. అయితే అక్కడ ఉన్న కొందరు ఆ ఘటనను వీడియో తీశారు. ఆ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వీడియో ఆధారంగా యూపీ పోలీసులు రెండు రోజుల క్రితం త్యాగి అక్రమంగా నిర్మించిన ఇంటిని బుల్డోజర్తో కూల్చివేశారు. పరారీలో ఉన్న అతన్ని ఇవాళ మీరట్‌లో పట్టుకున్నారు. త్యాగిపై గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కేసు బుక్ చేశారు.