కంఠేశ్వర్: ఈనెల 5 నుంచి 7వ తేదీవరకు నిర్మల్ జిల్లాలో జరుగనున్న 6వ రాష్ట్రస్థాయి యోగాసన (Yoga competitions ) పోటీలలో నిజామాబాద్( Nizamabad ) జిల్లా క్రీడాకారులు పాల్గొననున్నట్టు జిల్లా యోగాసన స్పోర్ట్స్ ప్రధాన కార్యదర్శి బాల శేఖర్ తెలిపారు. రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ , జూనియర్ బాలబాలికల యోగాసన పోటీలకు జిల్లా నుంచి 20 మంది యోగా క్రీడాకారులు గురువారం బయలుదేరారని వెల్లడించారు.
వీరితోపాటు టెక్నికల్ అఫీషియల్స్ 7గురు , నిజామాబాద్ జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ నుంచి రాష్ట్రస్థాయి పోటీల్లో న్యాయ నిర్ణేతలుగా జిల్లా నుంచి కోచ్గా ఎం. ఉమారాణి, డి.శివ కుమార్ వ్యవహరించనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు యోగ రామచంద్రం, యోగా రత్న ఎక్కొండ ప్రభాకర్ , ప్రధాన కార్యదర్శి బాల శేఖర్ , కార్యనిర్వ కార్యదర్శి ఎం సంగీత ,కోశాధికారి భూమా గౌడ్ , సంయుక్త కార్యదర్శులు రఘువీర్, కే గంగాధర్, సభ్యులు టీ జ్యోతి, రసాజ్ఞ తదితరులు క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని ఆకాంక్షించారు.