డిచ్పల్లి/సిరికొండ/ఆర్మూర్/వేల్పూర్/మోర్తాడ్, మార్చి 10: సావిత్రీబాయి ఫూలే వర్ధంతిని జిల్లాలో గురువారం నిర్వహించారు. ఆమె చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత పాల్గొని సావిత్రీబాయి చిత్రపటానికి నివాళులు అర్పించారు. సెంట్రల్ లైబ్రరీలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో సావిత్రీబాయి ఫూలేకు నివాళులు అర్పించారు. సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలో ప్రిన్సిపాల్ ఆర్.నర్సయ్య ఆధ్వర్యంలో సిబ్బంది సావిత్రీబాయి వర్ధంతిని నిర్వహించారు.
ఆర్మూర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాటు పలు కూడళ్లు, మండలంలోని గ్రామాల్లో సావిత్రీబాయి ఫూలే వర్ధంతిని టీఆర్ఎస్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడ్కుడ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సావిత్రీబాయి ఫూలే వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మోర్తాడ్‌లోని జ్యోతిబాఫూలే విగ్రహం వద్ద సావిత్రీబాయి ఫూలే వర్ధంతిని దళిత సంక్షేమ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.