ఉద్యోగాల భర్తీతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బుధవారం ప్రకటన చేయడంతో జిల్లావ్యాప్తంగా సంబురాలు వెల్లువెత్తాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు హర్షం వ్యక్తంచేశారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. పటాకులు కాల్చి.. జై కేసీఆర్.. జై తెలంగాణ నినాదాలు చేశారు. పలుచోట్ల బైక్‌ర్యాలీలు నిర్వహించ గా.. మరొకొన్ని చోట్ల మిఠాయిలు పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు.
– నమస్తే తెలంగాణ యంత్రాంగం, మార్చి 9
జిల్లా పరిషత్ ఆవరణలో చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు అన్సారీ, రాజేంద్రప్రసాద్, రాజేశ్వర్, సాయికుమార్, అక్తర్‌ఖాన్, శేఖర్‌రాజ్, శ్రీనివాస్‌గౌడ్, యెండల ప్రదీప్ పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ మెయిన్‌గేట్ ఎదుట టీఆర్ఎస్ నాయకుడు చింత మహేశ్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఇందల్వాయిలో ఎంపీపీ రమేశ్నాయక్తో కలిసి ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలువేరి గంగదాస్, ప్రధాన కార్యదర్శి పులి శ్రీనివాస్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా 149 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల కుటుంబాలు సీఎంకు రుణపడి ఉంటాయని సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డం లక్ష్మీనారాయణ అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయం హర్షణీయమని ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్, టీయూ పాలక మండలి సభ్యుడు ఎం.మారయ్యగౌడ్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు ఆధ్వర్యంలో, ధర్నాచౌక్‌లో టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. పార్టీ కార్యదర్శి ఎనుగందుల మురళి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ధర్పల్లిలోని గాంధీచౌక్ వద్ద ఎంపీపీ నల్ల సారికాహన్మంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు.
మోపాల్ మండలం మంచిప్పలో గ్రామస్తులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నిజామాబాద్ రూరల్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మీసాల మధుకర్‌రావు తదితరుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సిరికొండలో స్వీట్లు పంచిపెట్టారు. మండల అధ్యక్షుడు జస్వంత్ తదితరులు పాల్గొన్నారు. వర్ని మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్లాలి గిరి ఆధ్వ ర్యంలో యువకులు, నిరుద్యోగులు మోటర్‌సైకిల్ ర్యాలీ నిర్వ హించారు.
మండల కేంద్రంలోని సుభాష్‌చంద్రబోస్ విగ్రహం వద్ద బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, కో-ఆప్షన్ సభ్యుడు కరీం, సరిచంద్, బుజ్జిబాబు, దిలారిబాబు తదితరులు పాల్గొన్నారు. చందూర్ మండల కేంద్రంతోపాటు కారేగాం తదితర గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఏఎంసీ చైర్పర్సన్ కవితాఅంబర్సింగ్, సర్పంచులు దేవీసింగ్, సాయారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మూడ్ అంబర్‌సింగ్, ప్యారం అశోక్, రవి తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్‌లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పస్క నర్సయ్య ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ఎంపీటీసీలు, నాయకులు సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
కమ్మర్‌పల్లిలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్థానిక యువకులతో కలిసి సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, ఎంపీటీసీ మైలారం సుధాకర్, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్ బద్దం రాజేశ్వర్, గ్రామశాఖ అధ్యక్షుడు చింత గణేశ్, యూత్ అధ్యక్షుడు కొత్తపల్లి రఘు తదితరులు పాల్గొన్నారు.
ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్‌లో పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజపూర్ణానందం, సర్పంచ్ భీమనాతి భానుప్రసాద్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అంజిరెడ్డి, ఉప సర్పంచ్ క్యాతం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ముప్కాల్‌లోని గాంధీచౌక్ వద్ద టీఆర్ఎస్ నాయకుల పటాకులు కాల్చి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. పార్టీ సీనియర్ నాయకులు సామ వెంకట్‌రెడ్డి, బద్దం నర్సారెడ్డి, సర్పంచ్ కొమ్ముల శ్రీనివాస్, కో-ఆప్షన్ సభ్యుడు మునీరుద్దీన్, యువజన సంఘం అధ్యక్షుడు విఘ్నేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
భీమ్‌గల్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్ చిరంజీవి, కాంట్రాక్ట్ లెక్చరర్లు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. మోర్తాడ్‌లోని జాతీయ రహదారిపై ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఏలియా, డీసీసీబీ డైరెక్టర్ భూమన్న, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పర్స దేవన్న ఆధ్వర్యంలో పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకున్నారు.
బాల్కొండలో బస్టాండ్ కూడలి వద్ద టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్‌రెడ్డి, యువజన నాయకుడు రాజేశ్ ఆధ్వర్యంలో పటాకులు కాలుస్తూ సంబురాలు జరుపుకొన్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. మెండోరా జడ్పీటీసీ తలారి గంగాధర్ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచి యువతకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నవీన్‌గౌడ్, సావెల్ సొసైటీ చైర్మన్ రాజారెడ్డి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మిట్టపల్లి మోహన్‌రెడ్డి, సర్పంచ్ దేవన్న తదితరులు పాల్గొన్నారు.
భీమ్‌గల్‌లో ఎంపీపీ ఆర్మూర్ మహేశ్, జడ్పీటీసీ చౌట్పల్లి రవి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మోయిజ్, రైతుబంధు సమితి మండల సభ్యుడు శర్మానాయక్, సొసైటీ చైర్మన్లు శివసారి నర్సయ్య, మలావత్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. మాక్లూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు జాఫర్, రాణా, సావిత్రి, రవీందర్, సత్యనారాయణ, గోపి, రామకృష్ణ తదితరులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
బోధన్ పట్టణంలో టీఆర్ఎస్ బోధన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే షకీల్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ బోధన్ పట్టణ అధ్యక్షుడు గాండ్ల రవీందర్ యాదవ్, పట్టణ ప్రధానకార్యదర్శి అబ్దుల్ రెహ్మన్ తదితరులు పాల్గొన్నారు.
బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జీజేసీ, ప్రభుత్వ మధుమలంచ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి, సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి సంబురాలు చేసుకున్నారు. అధ్యాపకులు ప్రవీణ్, సాజిద్, శ్రీనివాస్, జగదీశ్, గంగాధర్, హకీం తదితరులు పాల్గొన్నారు.
బోధన్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు గణేశ్ పటేల్, శంకర్‌గౌడ్, మజార్, రవి, బండారుపల్లి సర్పంచ్ సాయిలు, బాల్‌రాజు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే షకీల్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.రెంజల్ మండలం సాటాపూర్ తెలంగాణ చౌరస్తాలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూమారెడ్డితో పాటు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. నవీపేటలో సీఎం కేసీఆర్‌చిత్రపటానికి ఎంపీపీ సంగె శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మువ్వ నాగేశ్వర్రావు, జడ్పీటీసీ నీరడి సవిత, వైస్ ఎంపీపీ హరీశ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మార్నేని కృష్ణమోహన్‌రావు తదితరులు క్షీరాభిషేకం చేశారు.
నందిపేట్‌లోని బస్టాండ్ వద్ద రోడ్డుపై సీఎం కేసీఆర్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చిత్రపటాలకు ఎంపీపీ సంతోష్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మచ్చర్ల సాగర్, సొసైటీ చైర్మన్ మీసాల సుదర్శన్, నాయకులు లక్ష్మీనారాయణ, ఇమ్రాన్ తదితరులు క్షీరాభిషేకం చేశారు.
మా పిల్లల చదువుపై శ్రద్ధ వహిస్తాం
సీఎం కేసీఆర్ శాసనసభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖాళీలుగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించడం సంతోషించదగిన విషయం. మా పిల్లలను వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలకు చెందిన సబ్జెక్టుల్లో మరింతగా శ్రద్ధ వహించేలా చూస్తాం. సర్కారు కొలువు సాధిస్తారన్న నమ్మకముంది.
-రాజిరెడ్డి, క్యాసంపల్లి
నీళ్లు, నిధులు ఇప్పుడు నియాకాలు
నీళ్లు, నిధులు, నియమకాల పేరుతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నిధులు, నీళ్లు గతంలో వచ్చాయి. ఇప్పుడు నియామకాలు చేపట్టడంతో రాష్ట్రం మరింతగా ముందుకెళ్తుంది. రాష్ట్రంలో ఉన్న ఖాళీ పోస్టుల భర్తీకి చేపట్టిన ప్రక్రియ నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపనున్నది.
-అనిల్‌రెడ్డి, చిన్నమల్లారెడ్డి