నమస్తే తెలంగాణ యంత్రాంగం, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబురాలను జిల్లాలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మహ్మద్ షకీల్‌తోపాటు ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, నగర మేయర్ నీతూకిరణ్ ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కోర్టు న్యాయమూర్తి సునీత కుంచాలను ఆర్ఎం సుధాపరిమళ సన్మానించారు. బోధన్ శివారులోని అప్నా ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సదస్సుకు ఎమ్మెల్యే షకీల్ ముఖ్యఅతిథిగా హాజరై పలువురు మహిళా ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులతో కలిసి కేక్ కట్‌చేశారు. మహిళా ఉద్యోగులలో కలిసి సెల్ఫీలు దిగారు.
ఎమ్మెల్యే సతీమణి ఆయేషా ఫాతి మా, జడ్పీ వైస్ చైర్పర్సన్ ఎం.రజితాయాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మావతి, ఎంపీపీ బుద్దె సావిత్రి, జడ్పీటీసీ గిర్దావర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్‌లోని ఎంఆర్ గార్డెన్స్‌లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పలువురు ఉద్యోగిణులు, మహిళా డాక్టర్లు, కార్మికుల ను సన్మానించారు. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పండిత్ వినిత, షేక్ మున్నా తదితరులు పాల్గొన్నారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వేల్పూర్‌లోని రైతువేదిక వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ రంగాలకు చెందిన వెయ్యి మంది మహిళలు హాజరయ్యారు. వారందరికీ మంత్రి సొం త ఖర్చుతో సమకూర్చిన చీరెలను ప్రజా ప్రతినిధులు బహూకరించి భోజనాలు ఏర్పాటు చేశారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతోపాటు ఉద్యోగినులను ఎమ్మెల్యే బిగాల, కలెక్టర్ నారాయణరెడ్డి సన్మానించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మహిళా సిబ్బందిని సీపీ నాగరాజు సన్మానించారు.