ముంబై: కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ నితీశ్ రాణా ఓ భారీ సిక్సర్‌తో.. స్టేడియంలో ఉన్న ఫ్రిడ్జ్ గ్లాస్ అద్దాల్ని పగలగొట్టేశాడు. సన్‌రైజర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో బలమైన కట్ షాట్ ఆడాడు రాణా. అయితే నితీశ్ రాణా బ్యాట్‌కు తగిలిన బంతి.. అతి వేగంతో గాలిలో థార్డ్‌మ్యాన్ దిశగా వెళ్లింది. బౌండరీ లైన్ అవతల ఆ బంతి నేరుగా ప్లేయర్లు ఉండే డగౌట్ ప్రాంతంలో పడింది. అక్కడ ఉన్న ఫ్రిడ్జ్‌ను బంతి ఢీకొట్టింది. దీంతో ఆ ఫ్రిడ్జ్ గ్లాస్ పగిలిపోయింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓడినా.. రాణా షాట్ అందర్నీ ఆకట్టుకున్నది. ఫ్రిడ్జ్ పగిలిన సన్నివేశాన్ని ప్లేయర్లు, కామెంటేటర్లు, ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఆ వీడియో ఇదే.
— Diving Slip (@SlipDiving) April 15, 2022