టాలీవుడ్ యాక్టర్ నితిన్ తన చిరకాల స్నేహితురాలు షాలిని కందుకూరిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2020 జులైలో వీరి పెండ్లి జరిగింది. త్వరలో రంగ్ దే సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నితిన్ పెండ్లికి ముందు..తర్వాత తన జీవితం ఎలా ఉందో చెప్పుకొచ్చాడు.
వివాహం తర్వాత తాను సంతోషకరంగా ఉన్నానని చెప్పాడు నితిన్. పెండ్లికి ముందు షూటింగ్స్‌కు వెళ్లొచ్చిన తర్వాత షాలినితో మాట్లాడుతూ రిలాక్స్ అయ్యేవాడిని. పెండ్లి తర్వాత ఇంటికి తిరిగొచ్చిన తర్వాత షాలిని కంపెనీని వీడలేకపోతున్నానంటూ చెప్పుకొచ్చాడు నితిన్. మీ సినిమాలపై షాలిని రియాక్షన్ ఎలా ఉంటుందని ప్రశ్నించగా..ఇద్దరం టీవీ షోస్, వెబ్‌సిరీస్, ఓటీటీ సినిమాలు చూశాం. షాలిని నా సినిమా అంతగా చూడదని చెప్పాడు నితిన్.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.