అందంతో పాటు చక్కటి అభినయంతో యువతరంలో మంచి గుర్తింపును సంపాదించుకుంది మలయాళీ సోయగం కేథరిన్ ట్రెసా. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ సుందరి మరో బంపరాఫర్‌ను దక్కించుకుంది. నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంలో కేథిరిన్ట్రెసా రెండో నాయికగా కనిపించనుంది. నితిన్‌తో ఆమెకిది తొలిచిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో కథాపరంగా కేథరిన్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్లో ఈ అమ్మడు పాల్గొనబోతున్నదని పేర్కొన్నారు. ఎం.ఎస్.రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్, శ్రేష్ట్ మూవీస్ పతాకాలపై సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 29న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: మహతి స్వరసాగర్, మాటలు: మామిడాల తిరుపతి, సమర్పణ: రాజ్‌కుమార్ ఆకెళ్ల, రచన-దర్శకత్వం: ఎం.ఎస్.రాజశేఖర్‌రెడ్డి.