
కన్నెపల్లి, నవంబర్ 16 : మండలంలోని తెనుగుపల్లెకు ఆర్టీసీ బస్సు ప్రారంభమైంది. గతంలో బెల్లంపల్లి నుంచి తెనుగుపల్లెకు బస్సు నడచేది. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా బస్సు నడవడం లేదు. దీంతో గ్రామస్తులు ఆటోలు, ఇతర వా హనాల్లో వెళ్లేవారు. ఇటీవల భీమిని మండలంలోని తెనుగుపల్లె , రాజారం, పెద్దపేట గ్రామాలోల బెల్లంపల్లి ఎమ్మెల్యే దు ర్గం చిన్నయ్య పర్యటించారు. ఆర్టీసీ బస్సు రావడం లేదని , ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆయనకు విన్నవించారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి మంచిర్యాల ఆర్టీసీ డీఎం తో మాట్లాడి బస్సు వచ్చేలా కృషి చేశారు. దీంతో మం డల ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కన్నెపల్లి మండలంలోని టేకులపల్లి, జన్కాపూర్, ఎల్లారం గ్రామస్తులకు కూడా ఎంతో సౌకర్యం కలిగింది.
ట్వీట్‌కు స్పందించిన ఆర్టీసీ ఎండీ
దండేపల్లి, నవంబర్16 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మం డలం ముత్యంపేటకు చెందిన తోట పవన్ చేసిన ట్వీట్‌కు ఆర్టీ సీ ఎండీ సజ్జనార్ స్పందించారు. రాత్రి 10.30 గంటల తర్వా త కరీంనగర్ నుంచి మంచిర్యాల వయా లక్షెట్టిపేటకు వెళ్లేందుకు బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నామని పవన్ తన ఖాతా ద్వారా ఆర్టీసీ ఎండీకి ట్వీట్ చేశా డు. వెంటనే స్పందించిన ఎండీ కరీంనగర్ ఆర్టీసీ డిపో అధికా రి పద్మావతి ఫోన్ నంబర్‌ను ఇచ్చి తనను సంప్రదించాలని సూ చించారు. ప్రయాణికుల ఇబ్బందులను అధికారికి దృష్టికి తీసుకెళ్లగా, సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించిన తీరుకు పవన్ కృతజ్ఞతలు తెలిపాడు.