క్రైస్ట్‌చర్చ్: పాకిస్థాన్‌తో జరిగిన నాలుగవ టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో నెగ్గింది. కివీస్ ఓపెనింగ్ బ్యాటర్లు ఫిన్ అల్లెన్, డేవాన్ కాన్వేలు తొలి వికెట్‌కు 117 రన్స్ జోడించి జట్టుకు విజయాన్ని అందించారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఏడు వికెట్ల నష్టానికి 130 రన్స్ చేసింది. అయితే స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్ ఈజీగా లక్ష్యాన్ని చేరుకున్నది. ఓపెన్ అల్లెన్ 62 రన్స్ చేశాడు. అతను కేవలం 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇక మరో ఓపెనర్ కాన్వే కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతను 49 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ, మిచెల్ సాంట్నర్, మైఖేల్ బ్రేస్‌వెల్‌లు చెరో రెండేసి వికెట్లు తీసుకున్నారు.