నల్లగొండ పట్టణంలో రోడ్డు విస్తరణలో తొలగించే 50 ఏండ్లకు పైబడిన చెట్లకు ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’
పునర్జీవం ప్రసాదించనున్నది. మర్రిగూడ జంక్షన్లో తొలగించే 30 చెట్లలో ఐదింటిని ఈ నెల 26న అర్బన్ పార్కులో నాటనున్నట్టు గ్రీన్ ఇండియా వ్యవస్థాపకుడు, ఎంపీ సంతోష్‌కుమార్ ట్విట్టర్లో తెలిపారు. మిగతా 25 చెట్లను ఈనెల చివరి వరకు అర్బన్ పార్కు, ఎన్ఏఎం రోడ్, కలెక్టర్ ఆఫీస్ వద్ద నాటనున్నట్టు పేర్కొన్నారు.