CJI Chandrachud | లండన్: న్యాయమూర్తిగా తాను ఎన్నడూ రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొనలేదని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. సమాజంలో న్యాయమూర్తులు పోషించగలిగే మానవీయ పాత్ర గురించి ఆక్స్ఫర్డ్ యూనియన్ సొసైటీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొందరు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ‘మీరు తీర్పులు ఇచ్చేటపుడు ఏమైనా రాజకీయ, సామాజిక ఒత్తిళ్లను ఎదుర్కొన్నారా?’ అని అడిగినపుడు జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ, న్యాయమూర్తిగా తన 24 ఏళ్ల జీవితంలో అధికారంలో ఉన్నవారి నుంచి ఎన్నడూ రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొనలేదని చెప్పారు.
ప్రభుత్వంలోని రాజకీయ విభాగంతో సంబంధం లేనట్లుగా, ఒంటరిగా ఉంటామని తెలిపారు. అయితే, న్యాయమూర్తులకు తమ తీర్పుల ప్రభావం పరిపాలనపై ఏ విధంగా ఉంటుందో తెలిసి ఉండాలన్నారు. అది రాజకీయ ఒత్తిడి కా దని, ఓ తీర్పు ప్రభావం ఏ విధంగా ఉం టుంది? అనే అంశంపై కోర్టు అవగాహన చేసుకోవడం అవుతుందని తెలిపారు. ఎన్నికల గురించి అడిగినపుడు సీజేఐ మాట్లాడుతూ, రాజ్యాంగపరమైన ప్రజాస్వామ్య మూలాల్లో ఎన్నికల ప్రక్రియ ఉందని, భారత దేశంలో న్యాయమూర్తులు ఎన్నికల ద్వారా నియమితులు కారని, పరిస్థితుల కొనసాగింపు భావనను న్యాయమూర్తులు ప్రతిబింబించాలని, రాజ్యా ంగ విలువలను కొనసాగించాలని చెప్పారు. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ చాలా ముఖ్యమైన పాత్రను పోషి ంచవలసి ఉంటుందన్నారు. తాము సంప్రదాయ భావనను, మంచి సమాజం భవిష్యత్తు ఏ విధంగా ఉండాలో తెలియజేసే విధంగా వ్యవహరించాలని తెలిపారు.