బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్‌పై నయనతార అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన దృష్టిలో దక్షిణాది స్టార్ నయనతార కాదంటూ ఇటీవల కరణ్ జోహార్ తన టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’లో వ్యాఖ్యానించారు.
సమంత అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రశ్నలు అడిగే క్రమంలో కరణ్ జోహార్ ..‘మీరు ఇటీవల పనిచేసిన సౌత్ స్టార్ ఎవరు’ అని అడిగారు. ‘నయనతారతో ఈ మధ్య ఒక సినిమాలో నటించాను. ఆమె దక్షిణాది స్టార్స్‌లో ఒకరు’ అంటూ సమంత సమాధానమిచ్చింది.
ఈ సమాధానానికి అడ్డొచ్చిన కరణ్…‘నాకున్న లిస్టు ప్రకారం నయనతార బిగ్ స్టార్ కాదు’ అన్నారు. కరణ్ స్పందనపై సమంత రిైప్లె ఇవ్వలేదు. ఈ వీడియో క్లిప్ బయటకు రావడంతో కరణ్ జోహార్ నయనతార అభిమానుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది. నయనతార స్టార్‌డమ్‌ను కరణ్ జోహార్ కావాలనే అవమానించారంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు.