అమరావతి: విన్యాసాల కోసం నేవీ స్కైడైవర్స్ విమానం నుంచి దూకారు. అయితే ఇద్దరు స్కైడైవర్స్ గాలిలో ఉండగా వారి పారాచూట్లు చిక్కుకున్నాయి. దీంతో నియంత్రణ కోల్పోయారు. గాలిలో తిరుగుతూ వేగంగా భూమి మీదకు దూసుకొచ్చి సముద్రంలో పడ్డారు. (Navy skydivers’ narrow escape) అదృష్టవశాత్తు రెస్క్యూ బోట్లు అక్కడ ఉండటంతో ఆ స్కైడైవర్స్ను వెంటనే కాపాడారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రతి ఏటా డిసెంబర్ 4న నేవీ డే నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్న ఈస్ట్రన్ నేవల్ కమాండ్ (ఈఎన్సీ) తన శక్తి, సామర్థ్యాలను చాటేందుకు సన్నద్ధమైంది.
కాగా, గురువారం విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ వద్ద నేవీ సిబ్బంది రిహార్సల్ నిర్వహించారు. ఈ సందదర్భంగా నేవీ స్కైడైవర్స్ ఆకాశంలో ఎగురుతున్న విమానం నుంచి దూకారు. ఒకరు జాతీయ జెండా, మరొకరు నేవీ పతాకాన్ని పట్టుకున్నారు. అయితే చాలా ఎత్తులో గాలిలో ఉండగా వారి పారాచూట్లు చిక్కుకున్నాయి. దీంతో ఇద్దరు నేవీ స్కైడైవర్స్ గాలిలో గింగిరిలు కొట్టారు. వేగంగా నేలపైకి దూసుకొచ్చారు. అయితే అదృష్టవశాత్తు సముద్ర తీరంలోని నీటిలో పడ్డారు. అక్కడ బోట్లలో ఉన్న రెస్క్యూ సిబ్బంది వెంటనే వారి వద్దకు చేరుకుని కాపాడారు. దీంతో ఇద్దరు నేవీ స్కైడైవర్స్కు ప్రాణాపాయం తప్పింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
The Indian Navy MARCOS are fine. They did not collide; instead, the parachutes had become entangled. The rescue boats were nearby and reached the location where they had fallen.#Vizag pic.twitter.com/SRoKqJplhV
— Akash Sharma (@kaidensharmaa) January 3, 2025