ఊపిరితిత్తులు శుభ్రం కావాలా..? ఇలా చేయండి..!
Health tips | నిత్యం ధూమపానం చేసేవారికే కాదు, కాలుష్యంలో తిరిగేవారికి కూడా ఊపిరితిత్తుల వ్యాధులు పొంచి ఉంటాయి.
నిత్యం సిగరెట్, బీడీ, మద్యం తాగేవారికే కాదు, కాలుష్యంలో తిరిగేవారికి కూడా ఊపిరితిత్తుల వ్యాధులు పొంచి ఉంటాయి. ఊపిరితిత్తులు విష వ్యర్థాలతో నిండిపోయి అనేక సమస్యలు వస్తాయి. అయితే ఈ సహజ సిద్ధమైన చిట్కాలు పాటిస్తే ఊపిరితిత్తుల ( Lungs )ను శుభ్రం చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు వెళ్లిపోతాయి. దీంతో ఊపిరితిత్తులు కూడా శుభ్రమవుతాయి. అయితే నిమ్మరసానికి బదులుగా పైనాపిల్, క్రాన్బెర్రీ జ్యూస్లను కూడా తాగవచ్చు.
పరగడుపునే ఒకటి లేదా రెండు టీస్పూన్ల అల్లం రసం సేవించినా ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి.
ఉదయాన్నే 3 నుంచి 5 పుదీనా ఆకులను అలాగే నమిలి మింగితే ఊపిరితిత్తులకు బలం కలుగుతుంది. అలాగే ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి.
రోజూ ఉదయాన్నే ప్రాణాయామం చేయడం వల్ల కూడా ఊపిరితిత్తులను శుభ్రంగా మార్చుకోవచ్చు.
గోరు వెచ్చని నీటిలో 5 నుంచి 10 చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి అనంతరం వచ్చే ఆవిరిని పీలిస్తే ఊపిరితిత్తుల్లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
ఛాతిపై నిత్యం ఆముదాన్ని మర్దనా చేస్తుంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
ఇవి కూడా చదవండి..
పెరుగును ఇలా ఉపయోగించండి.. అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టండి..!
ఈ సమ్మర్లో షుగర్ పేషెంట్స్ ఇవి ట్రై చేయొచ్చు
కిడ్నీ స్టోన్లు ఉన్నాయని తెలిపే లక్షణాలు ఇవే..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

