కాన్పూర్: జాతీయ సీనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేసి అర్జున్ జోరు కొనసాగుతున్నది. బుధవారం జరిగిన పదో రౌండ్ పోరులో రెండో సీడ్ అర్జున్..ఇనియాన్(తమిళనాడు)తో గేమ్‌ను 41 ఎత్తుల్లో డ్రా చేసుకున్నాడు. మరోపోరులో తమిళనాడు గ్రాండ్‌మాస్టర్ గుకేశ్..మాజీ జాతీయ చాంపియన్ అభిజీత్ గుప్తా(పీఎస్‌పీబీ)పై గెలిచి అర్జున్(8)తో కలిసి టోర్నీలో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ అరవింద్ చిత్తాబరం..ఆర్యన్ చోప్రాతో గేమ్‌ను డ్రాగా ముగించుకున్నాడు. ఇనియాన్(7.5), అరవింద్(7.5), ఆర్యన్(7.5), సేతురామన్(7.5), ప్రణవ్(7.5) వేర్వేరు స్థానాల్లో ఉన్నారు.