హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన తెలంగాణకు చెందిన సమీర్ సయ్యద్, విజయనగరానికి చెందిన సిరాజ్ ఇచ్చిన సమాచారం మేరకు సికింద్రాబాద్‌తో సహా నాలుగు చోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో సమీర్ ఇంట్లో సమావేశమైన కుర్రాళ్ల గురించి ఆరా తీసింది.
నాలుగుచోట్ల జరిగిన సోదాల్లో పలు సాంకేతిక ఆధారాలను ఎన్ఐఏ అధికారులు కనుగొన్నట్లు తెలిసింది. కాగా తెలంగాణ ఇంటెలిజెన్స్ సిబ్బంది సైతం సమీర్‌తో సమావేశమైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నది.