కుభీర్ : భారత జాతీయ జెండా ( National flag ) కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదని మన సమష్టి ఐక్యతకు ( Indian unity) గర్వ కారణమని ఎన్సీసీ కేర్ టేకర్ పార్థసారథి, ప్రధానోపాధ్యాయుడు సట్ల గంగాధర్ అన్నారు.
నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఎన్సీసీ ( NCC ) కేడేట్లు, విద్యార్థులు జాతీయ జెండాలను చేతబూని నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ( Rally) నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి భారతీయుడి ఇంటిలోకి తిరంగ జెండా తీసుకువచ్చి, దేశ స్వాతంత్ర్య వేడుకలలో గర్వంగా జాతీయ పతాకాన్ని ఎగురవేయమని చాటి చెప్పేందుకే ‘ హర్ ఘర్ తిరంగా’ (Har Ghar Tiranga) ఉద్దేశమని అన్నారు. చారిత్రాత్మకంగా జెండాతో దేశ ప్రజల సంబంధం దూరంగా ఉండకుండా హృదయపూర్వక సంబంధంగా మార్చే ప్రయత్నoలో భాగమని అన్నారు.
ప్రతి పౌరుడిలో లోతైన దేశభక్తిని రగిలించడానికి , జాతీయ జెండా ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించ నికి కృషి చేస్తుందని అన్నారు. అనంతరం పలుకూడళ్ల లో మానవహారాలు నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ర్యాలీ పాఠశాల నుంచి పాత బస్టాండ్ పోలీస్ స్టేషన్, విఠలేశ్వర ఆలయం, బస్టాండ్ నుంచి మట్టి గల్లీ మీదుగా కొనసాగింది. ఈ ర్యాలీలో గ్రామస్థులు, యువకులు, ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.