
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజాదరణ తగ్గిపోతున్నదని, బీసీ జనగణన జరుపకుంటే మరింత గడ్డుకాలం తప్పదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్ హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఇటీవల ఉపఎన్నికలు నిర్వహించిన మూడు లోక్సభ, 29 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒక పార్లమెంటు, 7 అసెంబ్లీ సీట్లను మాత్రమే గెలుచుకోవడం ఇందుకు నిదర్శనమని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో పెరుగుతున్న ధరల పట్ల పేదవాడి ఆగ్రహం ఎన్నికల్లో వ్యక్తమైందని చెప్పారు.