‘హిట్’ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటివరకూ వచ్చిన రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ నుంచి రానున్న మూడో ప్రయత్నం ‘హిట్ : ది 3rd కేస్’. అగ్ర హీరో నాని కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. రాఘవ్ రాసిన ఈ పాటను మిక్కీజే మేయర్ స్వరపరచగా అనిరుధ్ ఆలపించారు. పూర్తిగా ఒకే టేక్‌లో ఈ పాటను షూట్ చేయడం జరిగిందని మేకర్స్ చెబుతున్నారు. సినిమాలోని క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా ఉండే సున్నితమైన విజువల్స్ ఈ పాటలో చూడొచ్చు. శ్రీనిధిశెట్టి పాత్రను కలవడానికి వెళ్తున్న నాని హ్యాపీ మూమెంట్‌ని ఆ పాట ఆవిష్కరిస్తున్నది. ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్, నిర్మాణం: వాల్‌పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్.