e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News కల్యాణ వైభోగమే..

కల్యాణ వైభోగమే..


పౌర్ణమిని పురస్కరించుకుని పలు ఆలయాల్లో కల్యాణోత్సవాలు
పెద్దసంఖ్యలో పాల్గొన్న భక్తులు


నార్కట్‌పల్లి, మార్చి 28: పౌర్ణమిని పురస్కరించుకొని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో రామలింగేశ్వరుడి కల్యాణం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మండలంలోని గోపలాయపల్లి గుట్టపై శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి ఆలయంలో వేణుగోపాల స్వామి కల్యాణాన్ని నిర్వహించారు. అర్చకులు, దేవాలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
వైభవంగా వేంకటేశ్వరుడి కల్యాణోత్సవం
రామగిరి : నల్లగొండ సమీపంలోని అన్నెపర్తి 12వ బెటాలియన్‌ వద్ద గల భూ, నీలా సమేత వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. బెటాలియన్‌ కమాండెంట్‌ ఎన్‌వీ.సాంబయ్య-శ్రీలక్ష్మి దంపతులు పట్టువస్ర్తాలు, తలంబ్రాలను సమర్పించారు. అనంతరం అన్నదానం చేశారు. వేడుకల్లో మారం జగన్‌మోహన్‌రెడ్డి- పుష్పాదేవి, దంపతులు, అడిషనల్‌ కమాండెంట్‌ రామకృష్ణ- సుధామాధురి పాల్గొన్నారు.

ముప్పారంలో..
నిడమనూరు: ముప్పారం గ్రామంలోని అలివేలు మంగ సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి నిడమనూరు జడ్పీటీసీ నందికొండ రామేశ్వరి మంగళ సూత్రం, మెట్టెలు సమర్పించారు. మేళతాళాల నడుమ స్వామి వారి ఎదుర్కోళ్లు, తిరుకల్యాణం, గ్రామోత్సవం, బలి హరణం, హోమం వేలాది మంది భక్తుల సమక్షంలో వేదపండితులు నిర్వహించారు. మిర్యాలగూడ, వర్ధన్నపేట ఎమ్మెల్యే లు నల్లమోతు భాస్కర్‌రావు, ఆరూరిరమేశ్‌ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.అంతకు ముందు ఆలయ చైర్మన్‌ మేరెడ్డివెంకటరమణ ఆధ్వర్యంలో ఆలయఅర్చకుడు ప్రతాపురం మత్స్యగిరి స్వామి ఎమ్మెల్యేలకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్‌, డీసీసీబీ డైరెక్టర్‌ విరిగినేని అంజయ్య, దేవాదాయ శాఖ డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఈసం రమేశ్‌, ఈఓ నవీన్‌ కుమార్‌, సర్పంచ్‌ అల్లం శ్రీనివాస్‌, ఎంపీటీసీ భాస్కరి నాగేంద్ర పాల్గొన్నారు.

వేణుగోపాలస్వామి కల్యాణం..
కనగల్‌: మండల కేంద్రంలో శ్రీ వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం కనుల పండువగా నిర్వహించారు. ప్రధానార్చకుడు స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అర్చకుడు, పల్లిగుంతల నర్సిం హ, జడ్పీటీసీ చిట్ల వెంకటేశంగౌడ్‌, సర్పంచ్‌ నర్సింగ్‌ సునీతాకృష్ణయ్యగౌడ్‌, మాజీ జడ్పీటీసీ నర్సింగ్‌ శ్రీనివాస్‌గౌడ్‌, బెజవాడ శ్రీహరి, చిట్ల లింగయ్య సత్యనారాయణ పాల్గొన్నారు.

గంగాభవాని లింగమంతుల ఉత్సవాలు ప్రారంభం
యాదవుల ఆరాధ్య దైవం గంగమ్మ లింగమంతుల స్వామి ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యా యి. సాయంత్రం సకల దేవతామూర్తులకు మకర తోరణం ఏర్పాటు చేసి రాత్రి గంపలను ఉరేగించారు. నేడు కల్యాణం నిర్వహించి బోనాలు సమర్పించనున్నారు.

ఘనంగా గోరక్షక స్వామి కల్యాణం
కట్టంగూర్‌(నకిరేకల్‌): నకిరేకల్‌ మండలం గోరెంకలపల్లిలో ఆదివారం గోరక్షక స్వామి కల్యాణోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని ప్రత్యేక పూలు చేసి అన్నదానం ప్రారంభించారు. గోరక్షక కమిటీ సభ్యులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కల్యాణ వైభోగమే..

ట్రెండింగ్‌

Advertisement