నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు 16180 క్యూసెక్కుల నీటి విడుదలను కొనసాగిస్తున్నా రు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.90 ( 311.7462 టీఎంసీలు)మేర నీరు నిల్వ ఉంది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 9633 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8280 క్యూసె క్కులు, ఎస్ఎల్బీసి ద్వారా 1800 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 30044 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
వరద కాల్వ ద్వారా నీటి విడుదల లేదు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుండి 65937 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగు తుండగా, అదే స్థాయిలో ఇన్‌ఫ్లో ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 884.50 అడుగులు ( 212.9198 టీఎంసీలు) ఉంది. శ్రీశైలంకు 51755 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది.