NC24 Excavation Begins | ఇటీవల తండేల్ సినిమాతో సూపర్‌హిట్‌ను అందుకున్న యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మరో కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాడు. సాయి ధరమ్ తేజ్‌కి విరుపాక్ష లాంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో చైతూ ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఎన్సీ24 అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా రాబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించనుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీకి సంబంధించి Excavation అనే పేరిటా ఒక వీడియోను పంచుకున్నారు మేకర్స్. ఈ వీడియో చూస్తుంటే.. చిత్రయూనిట్ ఈ సినిమా సెట్ కోసమే రాత్రింబవళ్ళు కష్టపడినట్లు తెలుస్తుంది.
మరోవైపు ఈ ప్రాజెక్ట్‌కు ‘వృష కర్మ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది. అయితే ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను తీసుకోబోతున్నారని టాక్ నడుస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బోగవల్లి ప్రసాద్‌తో పాటు సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.