న్యూఢిల్లీ: నాసా ఆస్ట్రోనాట్ రాజాచారి .. ఇండియాకు విషెస్ తెలిపారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన తన ట్విట్టర్లో స్పందించారు. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత సంతతి రాజాచారి.. తన ట్వీట్లో పూర్వీకుల దేశం గురించి కీర్తించారు. భారత్ స్వాతంత్య దినోత్సవాన్ని జరుపుకుంటోందని, స్పేస్ స్టేషన్ నుంచి ఆ దేశ వైభవాన్ని చూస్తున్నట్లు ఆయన తన ట్వీట్లో తెలిపారు. ఇక తన తండ్రికి చెందిన హైదరాబాద్ నగరం దివ్యంగా వెలుగుతోన్నట్లు రాజా చారి తన ట్వీట్లో వెల్లడించారు. భారత్, అమెరికా మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని, అన్ని రంగాల్లోనూ సహకారం అందుతోందన్నారు. ఇస్రో చేపడుతున్న అన్ని మిషన్లు సక్సెస్ కావాలని రాజాచారి ఆకాంక్షించారు.
On Indian Independence eve I’m reminded of Indian diaspora that I could see from @Space_Station where my immigrant father’s home town of Hyderabad shines bright. @nasa is just 1 place Indian Americans make a difference every day. Looking forward to @IndianEmbassyUS celebration pic.twitter.com/4eXWHd49q6
— Raja Chari (@Astro_Raja) August 14, 2022
🇺🇸NASA Astronaut Raja Chari
@Astro_Raja wishes on #Indiaat75. Thank you for your wonderful greetings 🇮🇳 @AmritMahotsav @MEAIndia @IndianDiplomacy @DDNewslive pic.twitter.com/iykjsxcYgN— India in USA (@IndianEmbassyUS) August 13, 2022