దాండియా వేడుకల్లో విషాదం
దాండియా వేడుక విద్యార్థుల పాలిట యమపాశంగా మారింది. లైటింగ్ సిస్టం కూలిపడి ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా మారిన దుర్ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం రాత్రి దాండియా సంగమం-2026 నిర్వహిస్తున్నారు.
- లైటింగ్ సిస్టం కూలిపడి బీటెక్ విద్యార్థిని మృతి
- 25 మందికి గాయాలు.. ఐదుగురి పరిస్థితి విషమం
- నాదర్గుల్ ఎంవీఎస్ఆర్ కళాశాలలో ఘటన
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి
బడంగ్పేట, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): దాండియా వేడుక విద్యార్థుల పాలిట యమపాశంగా మారింది. లైటింగ్ సిస్టం కూలిపడి ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా మారిన దుర్ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం రాత్రి దాండియా సంగమం-2026 నిర్వహిస్తున్నారు.
విద్యార్థులు ఆట పాటల్లో పాల్గొనేందుకు భారీ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఆనందోత్సాహాలతో దాండి యా ఆడుతుండగా అకస్మాత్తుగా లైటింగ్ సిస్టం కూలిపోయి షార్ట్సర్క్యూట్ జరిగింది. ఈ ఘటనలో వనపర్తి జిల్లాకు చెందిన బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని నారాయణదాసు సోని (18) తీవ్ర గాయాలపాలై మృతిచెందింది. పక్కనే ఉన్న ఆమె సోదరితో పాటు మరో ఐదుగురు తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఎల్బీనగర్ కామినేని దవాఖానకు తరలించారు. మొత్తం 25 మంది గాయాలపాలైనట్టు తెలుస్తున్నది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థి మృతి బాధాకరం: కేటీఆర్
నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన దాండియా వేడుకల్లో విద్యార్థి మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషాద ఘటనలో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

