బతుకమ్మను భావితరాలకు అందిద్దాం
తరతరాలుగా కొనసాగుతున్న అపురూపమైన బతుకమ్మ వేడుకల సంప్రదాయాన్ని కాపాడుకుంటూ భావితరాలకు అందించడం ప్రతి ఒకరి బాధ్యత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
- బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- ఈ వేడుకలు ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక
- సామూహిక వారసత్వానికి నిదర్శనం
- నాటి ఉద్యమంలో ఐక్యతను చాటిన వేడుకలు
- ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): తరతరాలుగా కొనసాగుతున్న అపురూపమైన బతుకమ్మ వేడుకల సంప్రదాయాన్ని కాపాడుకుంటూ భావితరాలకు అందించడం ప్రతి ఒకరి బాధ్యత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. తెలంగాణ సంస్కృతికి, ప్రకృతి ఆరాధనకు, ఆడపడుచుల ఆత్మగౌరవానికి సద్దుల బతుకమ్మ ప్రతీక అని తెలిపారు.
సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ఆడపడుచులందరికీ ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బతుకమ్మ పండుగ మన సాంస్కృతిక అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజల ఐక్యతను ప్రపంచానికి చాటిచెప్పిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం బతుకమ్మ పండుగకు రాష్ట్ర పండుగగా అధికారిక గుర్తింపునిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని పేర్కొన్నారు.
2017 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆడబిడ్డలకు పండుగ కానుక అందించిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు పండుగ కానుక అందించడంతోపాటు, తెలంగాణ నేతన్నల ఉపాధి కల్పించేందుకు కృషి జరిగిందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

