తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
సద్దుల బతుకమ్మ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలంగాణ ఆడబిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): సద్దుల బతుకమ్మ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలంగాణ ఆడబిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిదిరోజులపాటు ఆడబిడ్డల ఆటపాటలతో సాగిన బతుకమ్మ సంబురాలతో తెలంగాణవ్యాప్తంగా సందడి నెలకొన్నదని పేర్కొన్నారు.
ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మల్లారావమ్మా బతుకమ్మా.. మా బతుకులు బాగు చేయవమ్మా’ అంటూ బతుకమ్మకు వీడోలు పలుకుతూ మహిళలు ఘనంగా పండుగ ముగింపు వేడుకలు జరుపుకుంటారని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో, ప్రగతిలో మహిళల పాత్ర మహోన్నతమైనదని కేసీఆర్ గుర్తుచేశారు.
వారి కృషి, త్యాగాలను గుర్తించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేసిందని పేరొన్నారు. ఆడబిడ్డలకు ఎటువంటి కష్టం కలుగకుండా చూస్తూ, వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేయడం ద్వారానే బతుకమ్మ పండుగ స్ఫూర్తిని కొనసాగించిన వారమవుతామని స్పష్టంచేశారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలందరికీ సుఖసంతోషాలు కలుగాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

