మల్లేశం, స్వప్న జంటగా నటించిన ‘బ్రహ్మచారి’ చిత్రం ఇటీవలే విడుదలైంది. నర్సింగ్ దర్శకత్వం వహించారు. రాంభూపాల్ రెడ్డి నిర్మాత. తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా చక్కటి కామెడీ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటున్నదని చెప్పారు నిర్మాత రాంభూపాల్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ ‘విడుదలైన అన్ని చోట్ల మంచి స్పందన లభిస్తున్నది. గ్రామీణ ప్రాంతాలతో పాటు మల్టీఫ్లెక్స్‌లలో కూడా ఆదరణ బాగుంది. సమాజంలో బ్రహ్మచారులు ఎదుర్కొంటున్న కష్టాలను తెలంగాణ నేపథ్యంలో వినోదాత్మకంగా చూపించాం. నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడం ఆనందంగా ఉంది. సినిమా చూసిన వారందరూ చక్కటి సినిమా చేశానని ప్రశంసిస్తున్నారు’ అన్నారు.