న్యూఢిల్లీ: ఓ మహిళ తన కుమారుడి ప్రాణాలతో చెలగాటమాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఓ అపార్టుమెంట్లో 10వ అంతస్తులో ఓ కుటుంబం నివసిస్తున్నది. బాల్కనీలో దుస్తులను ఆరేయగా కొన్ని 9వ అంతస్తులు పడిపోయాయి. వెళ్లి తీసుకొద్దామనుకుంటే ఆ ఇంటికి తాళమేసి ఉన్నది. దీంతో ఆ తల్లి చీరె సాయంతో బాల్కనీ నుంచి కుమారుడిని 9వ అంతస్తులోకి జార విడిచింది. దుస్తులు తీసుకున్న ఆ బాలుడు బాల్కనీ రేలింగ్‌పై నిల్చొనగా మళ్లీ చీర సాయంతో పైకి లాగారు. అదృష్టవశాత్తూ ఆ బాలుడు క్షేమంగానే పైకి వచ్చాడు. అయితే ఆ తల్లిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.