అక్కినేని అందగాడు అఖిల్ మంచి విజయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.ఆయన నటించిన సినిమాలన్నీ ఫ్లాపులు కావడంతో తన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంపై భారీ హోప్స్ పెట్టకున్నాడు. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో పూజాహెగ్డే కథానాయికగా నటించింది.బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాన్ని జూన్ 19న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కారణంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.థియేటర్లోనా, ఓటీటీలోనా అనే సందేహాల మధ్య ఈ చిత్రాన్ని అక్టోబర్ 8న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.
ఇక ఇదే విషయాన్ని కన్ఫాం చేస్తూ మరో పోస్టర్ కూడా విడుదల చేశారు. హైదరాబాద్ – యూఎస్ఏ బ్యాక్ డ్రాప్ లో పోస్టర్ డిజైన్ చేసి దానిపై అఖిల్‌ని డిఫరెంట్ ట్రెండీ కాస్ట్యూమ్‌లో చూపించారు. కొన్నిట్లో ఫార్మల్ డ్రెస్ లో మరికొన్నిట్లో ట్రెండీ కాస్ట్యూమ్స్ లో అఖిల్ ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాతో మంచి విజయం సాధిస్తాడనే ఆశతో అఖిల్ ఉన్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఏజెంట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.