ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మూడీస్ అంచనా
- ఒమిక్రాన్‌తో కష్టాలే

న్యూఢిల్లీ, నవంబర్ 29: కరోనా వైరస్ కొత్త రకం ఒమిక్రాన్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కష్టాలేనని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ సోమవారం అంచనా వేసింది. ఒమిక్రాన్ కారణంగా గ్లోబల్ ఎకానమీకి కొత్త అనిశ్చితులు ఏర్పడవచ్చన్నది. అయితే దాని వ్యాప్తి, కేసులు, మరణాలు, వాక్సిన్ల ప్రభావంపై ఇది ఆధారపడి ఉంటుందని పేర్కొన్నది. ‘మచ్ టు లెర్న్ ఒమిక్రాన్ ఫాస్ట్’ పేరుతో ఓ విశ్లేషణను మూడీస్ విడుదల చేసింది. ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్నదని, మరో రెండు వారాలు గడిస్తేగానీ వైరస్ ప్రభావంపై అంచనాకు రాలేమని మూడీస్ అనలిటిక్స్ చీఫ్ ఎకనామిస్ట్ స్టీవ్ కొక్రేన్ అన్నారు.
టెల్కోలకు స్పెక్ట్రం దెబ్బ
ఆసియా-పసిఫిక్ దేశాల్లోని కొన్ని టెలికం సంస్థలకు మున్ముందు స్పెక్ట్రం బకాయిలు భారమయ్యే వీలున్నదని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ హెచ్చరించింది. స్పెక్ట్రం బకాయిలతో చైనా, భారత్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ దేశాల్లోని టెలికం సంస్థల రుణ భారం ఈ ఏడాది, వచ్చే ఏడాది 16 శాతానికిపైగా పెరుగవచ్చన్నది. 5జీ సేవల స్పెక్ట్రం కోసం భారతీ ఎయిర్టెల్ రూ.37,000 కోట్లదాకా ఖర్చు చేస్తున్నది.
ఒమిక్రాన్ ఉన్నా..
మరోవైపు ఒమిక్రాన్ వైరస్ భయాలున్నా వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయని జపాన్ బ్రోకరేజీ దిగ్గజం నొమురా తెలిపింది. నొమురా ఇండియా వారాంతపు బిజినెస్ రిజంప్షన్ ఇండెక్స్.. ఆదివారంతో ముగిసిన వారంలో 114.5గా నమోదైంది. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనం దిశలోనే వెళ్తున్నదని చెప్పింది. కాగా, ఒమిక్రాన్ ప్రభావం రవాణా వ్యవస్థపై ఎక్కువగా ఉండొచ్చని, దీంతో అంతర్జాతీయ విమాన సర్వీసుల ప్రారంభం మరింత ఆలస్యం కావచ్చన్నది.
ఎకనామీపై సీఎఫ్‌వోల ఆశలు
ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి చెందగలదన్న ఆశాభావాన్ని చాలామంది కార్పొరేట్ సీఎఫ్‌వోలు వ్యక్తం చేశారు. డెలాయిట్ ఇండియా నిర్వహించిన సర్వేలో ఈసారి 5-10 శాతం వృద్ధిరేటు నమోదవుతుందని వివిధ రంగాలు, వ్యాపారాలు, పరిశ్రమలకు చెందిన దాదాపు 70 శాతం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది జనవరి-జూలై మధ్య వర్చువల్‌గా జరిగిన ఈ సర్వేలో దాదాపు 100కుపైగా సీఎఫ్‌వోలు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- global economy
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

