హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సి రెజ్లింగ్ టోర్నీకి కరీంనగర్ జిల్లా కేశవపట్నంకు చెందిన మహమ్మద్ షెహజాన్ ఎంపికయ్యాడు. ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు చండీగఢ్ యూనివర్సిటీ జరుగనున్న టోర్నీలో జేఎన్టీయూ తరఫున గ్రీకోరోమన్ 55కిలోల విభాగంలో షెహజాన్ పోటీపడనున్నాడు.
ప్రస్తుతం హైదరాబాద్లోని గోకరాజు గంగరాజు ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీలో షెహజాన్ కంప్యూటర్ సైన్స్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. జాతీయ టోర్నీలో ఆడబోతున్న షెహజాన్ను జేఎన్టీయూ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి దిలీప్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అశోక్, కాలేజీ ప్రిన్సిపాల్ ప్రవీణ్, శంకరబాబు, పీడీ సుధాకర్ అభినందించారు.