హైదరాబాద్, ఆట ప్రతినిధి: డెక్కన్ ఎలైట్ ఓపెన్ బిగ్బోర్ గ్రాండ్ ప్రి షూటింగ్ టోర్నమెంట్లో హైదరాబాద్ రైఫిల్ షూటర్ మహమ్మద్ అష్రఫ్ గన్యాని సత్తా చాటాడు. 300 మీటర్ల రైఫిల్ ప్రోన్ వ్యక్తిగత విభాగంలో 273/300 స్కోరుతో రెండో స్థానంతో రజతం నెగ్గాడు. తెలంగాణ స్టేట్ షూటింగ్ చాంపియన్షిప్స్ 300మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో మూడో స్థానంతో కాంస్యం అందుకున్నాడు.