వేగవంతమైన చార్జింగ్‌ను అందిస్తుంది. స్మార్ట్ డిస్ప్లే ఇందులోని మరో విశేషం. దీని ద్వారా చార్జింగ్ అవుతున్నప్పుడు రియల్ టైమ్ వివరాలన్నీ స్పష్టంగా చూసుకోవచ్చు. చార్జర్‌కి ఏ పరికరం కనెక్ట్ చేసింది, బ్యాటరీ ఎంతవరకు చార్జ్ అయింది అనే సమాచారాన్ని స్క్రీన్‌పై చూపిస్తుంది. ఇక ‘యాక్టివ్ షీల్డ్’ సేఫ్టీ టెక్నాలజీ.. ఫోన్ ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుంది. ఎక్కువ వేడెక్కకుండా కాపాడుతుంది. రాత్రి సమయంలో చార్జింగ్ పెట్టుకునే వారికోసం ప్రత్యేకమైన ‘కేర్ మోడ్’ కూడా ఉన్నది. దీని పిన్స్ మడతపెట్టేలా డిజైన్ చేశారు. దీనివల్ల ప్రయాణాల్లో సురక్షితంగా ఉంటాయి.
ధర: రూ. 6,999
దొరుకుచోటు: అమెజాన్

ఇంట్లోనే చిన్నచిన్న రిపేర్లు చేసుకుంటారా? అందుకోసం ఇంకా మాన్యువల్ స్క్రూడ్రైవర్లనే ఉపయోగిస్తున్నారా? అయితే, Cordless Electric Screwdriver Precision Tool Setపై ఓ కన్నేయండి. ఈ ఎలక్ట్రిక్ స్క్రూడ్రైవర్ పూర్తిగా కార్డ్‌లెస్. దీనికి ఎలాంటి వైర్లు ఉండవు. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. ఈ టూల్ సెట్లో అన్ని రకాల ప్రిసిషన్ బిట్స్ లభిస్తాయి. అన్నిరకాల స్క్రూలను విడదీస్తాయి. ఈ టూల్ కిట్ శక్తిమంతమైన రీచార్జబుల్ లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. సాధారణ యూఎస్బీ కేబుల్ సహాయంతోనే దీనిని చార్జ్ చేసుకోవచ్చు. దీనికి ఉండే సింపుల్ బటన్ల ద్వారా క్లాక్ వైజ్, యాంటీ-క్లాక్ వైజ్ దిశలలో తిప్పుకోవచ్చు. స్క్రూలను బిగించడానికి, విప్పడానికి అనుకూలంగా మార్చుకోవచ్చు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లలో ఉండే అతి సూక్ష్మమైన స్క్రూలను తీయడానికి కూడా ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది.
ధర: రూ. 5,670
దొరుకుచోటు: nextoolstore.com

కంటెంట్ క్రియేషన్, వ్లాగింగ్, యూట్యూబ్ వీడియోలు, ఇంటర్వ్యూలు, లైవ్ స్ట్రీమింగ్ రంగంలో నాణ్యమైన ఆడియో ఉండటం చాలా ముఖ్యం. వీడియో ఎంత స్పష్టంగా ఉన్నా.. మాటలు సరిగ్గా వినిపించకపోతే ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం కష్టం. ప్రముఖ ఇమేజింగ్ బ్రాండ్ ఇన్‌స్టా 360 సంస్థ తీసుకువచ్చిన Insta360 Mic Pro ఉంటే.. అలాంటి ఇబ్బందులేం ఉండవు. ఈ అత్యాధునిక మైక్.. స్టూడియో స్థాయి శబ్దాన్ని అందిస్తుంది. ఈ మైక్రోఫోన్ ముందు భాగంలో ఉండే ఈ-ఇంక్ డిస్ప్లేలో మీరు మీ చానెల్ లోగోను, పేరును లేదా మీకు నచ్చిన గ్రాఫిక్స్/టెక్ట్స్‌ను సెట్ చేసుకోవచ్చు. ఇందులోని ఎన్పీయూ చిప్, ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ.. చుట్టూ ఉండే శబ్దాలను పూర్తిగా తొలగించి, మీ స్వరాన్ని అత్యంత స్పష్టంగా, సహజంగా రికార్డ్ చేస్తుంది. ఈ మైక్రోఫోన్.. అన్నిరకాల గ్యాడ్జెట్స్‌కు ఇట్టే కనెక్ట్ అవుతుంది.
ధర: రూ. 35,000
దొరుకుచోటు: insta360.com

టెక్నాలజీ ఎంత మారుతున్నా.. పాత రోజులను గుర్తుచేసే ‘రెట్రో’ డిజైన్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా 1980ల నాటి క్లాసిక్ ఆపిల్ మెకింతోష్ కంప్యూటర్ల రూపాన్ని ఇష్టపడని టెక్ ప్రేమికులు ఉండరు. ఈ నోస్టాల్జియాను ఆధునిక సాంకేతికతతో జోడిస్తూ వొకీస్ సంస్థ మార్కెట్లోకి తీసుకువచ్చిన అద్భుతమైన గ్యాడ్జెట్.. Wokyis Retro PC-StyleDocking Station. ఐదు అంగుళాల హెచ్డీ స్క్రీన్, మల్టీ-ఫంక్షనల్ ఫీచర్లతో.. టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నది. దీని ముందు భాగంలో అమర్చిన 5-అంగుళాల హై-డెఫినిషన్ ఐపీఎస్ స్క్రీన్ దీనికి ప్రధాన ఆకర్షణ. దీనిని సెకండరీ మానిటర్‌గానూ ఉపయోగించుకోవచ్చు. మీ మెయిన్ స్క్రీన్‌పై ఉన్న మ్యూజిక్ ప్లేయర్లు, చాట్ విండోస్ లాంటివి ఈ చిన్న స్క్రీన్‌పైకి డ్రాగ్ చేసి వీక్షించవచ్చు.
ఇందులో బిల్ట్-ఇన్ ఎస్ఎస్డీ ఎన్‌క్లోజర్ సపోర్ట్ లభిస్తుంది. దీని ద్వారా మీరు 8 టీబీ వరకూ అదనపు స్టోరేజ్‌ను యాడ్ చేసుకోవచ్చు. డేటా ట్రాన్స్ఫర్ వేగం కూడా 10 జీబీపీఎస్ వేగంతో ఉంటుంది. ఈ డాకింగ్ స్టేషన్‌కు బ్యాలెన్డ్స్ యూఎస్బీ పోర్ట్స్ (యూఎస్బీ ఎ, యూఎస్బీ సి), ఎస్డీ, మైక్రో ఎస్డీ కార్డ్ రీడర్లు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, హెచ్డీఎంఐ లాంటి అన్నిరకాల పోర్ట్స్ ఉన్నాయి. ఆపిల్ మ్యాక్ మినీ, ఇతర లేటెస్ట్ కాంపాక్ట్ కంప్యూటర్లను వాడుతున్నట్లయితే.. ఈ డాకింగ్ స్టేషన్ ఉండాల్సిందే!
ధర: రూ. 16,000
దొరుకుచోటు: wokyis.com