జోగులాంబ గద్వాల : మెడికో విద్యార్థిని ప్రియాంక కుటుంబాన్ని ఆలంపూర్ ఎమ్మెల్యే విజయడు పరామర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో మెడికో తండ్రి వెంకటేష్‌తో ఫోన్లో మాట్లాడించారు. ప్రియాంక కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. డాక్టర్ మృతికి కారకులైన నిందితులకు కఠిన శిక్ష పడేలా లీగల్ సెల్ ద్వారా చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు.
కాగా, ఈ నెల 3వతేదీన ఏపీలోని రాజమండ్రిలో సినిమా థియేటర్ నుంచి తోటి విద్యార్థితో కలిసి మెడికో ప్రియాంక (28) వస్తుండగా మద్యం మత్తులో ఉన్న దు శ్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్‌లు కారును వేగంగా నడుపుతూ వచ్చి బైక్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో తల్లిదండ్రులు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. 6 రోజులపాటు మృత్యువుతో పోరాడిన ప్రియాంక ఆదివారం మధ్యాహ్నం 3:22 గంటలకు తుదిశ్వాస విడిచారు.