శంషాబాద్ రూరల్, డిసెంబర్ 16 : గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. గురువారం మండలంలోని నర్కూడలో గౌడ సంఘం భవన నిర్మాణానికి, పిల్లోనిగూడ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపారు. గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీహాళ్లు, డ్వాక్రాభవనాలు, అంగన్వాడీ భవనాలు నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పరిశుభ్రతకు పెద్దపీట వేయడంతో పాటు గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ నీరటి తన్విరాజు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలికసదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వినయ్‌కుమార్, ఎంపీవో సురేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్ ఏఈ అనూష, గణేశ్‌గుప్త, వెంకటేశ్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మంచర్ల మోహన్‌రావు, పీఏసీఎస్ చైర్మన్లు దవాణాకర్గౌడ్, సతీశ్,సర్పంచ్‌లు బుచ్చమ్మ,రమేశ్‌యాదవ్,సతీశ్‌యాదవ్, డైరెక్టర్లు శివాజీ, బాల్‌రాజ్‌గౌడ్, నాయకులు గౌడ సంఘం అధ్యక్షుడు కుమార్‌గౌడ్, నర్సింహాగౌడ్, యాదగిరిగౌడ్, నాగేశ్గౌడ శంకర్‌గౌడ్, శ్రీకాంత్‌గౌడ్, హరినాథ్‌గౌడ్, జుర్కి రమేశ్, దర్గా సత్తయ్య,మైలారం భిక్షపతి పాల్గొన్నారు.