మణికొండ, డిసెంబర్ 14 : పేదింటి పెద్దన్నగా సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలుస్తారని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని గండిపేట తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మంగళవారం 35మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్నివర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసి దేశంలోనే అత్యున్నతమైన పాలనను అందిస్తున్నారని తెలిపారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కుటుంబాల్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. అదే విధంగా ఆసరా పింఛన్లు, ఆహారభద్రత కార్డులు, డబుల్బెడ్రూం ఇండ్లు ఇలాంటి పథకాలు పేదలకు ఎంతగానో అండగా నిలుస్తున్నాయన్నారు. అర్హులైన ప్రతి కుటుంబ సభ్యులు ఆడపడుచుల పెళ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు.నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ దారుగుపల్లి రేఖయాదగిరి, గండిపేట తహసీల్దార్ రాజశేఖర్, మణికొండ మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీరాములు పాల్గొన్నారు.