మైలార్‌దేవ్‌పల్లి,డిసెంబర్10: ఆలయాలు నిర్మించడం పూర్వ జన్మ సుకృతంగా భావించాలని హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య స్వామిజీ అన్నారు. శుక్రవారం మైలార్‌దేవ్‌పల్లిలోని మధుబన్ కాలనీలోని విజయ కనకదుర్గా ఆలయం నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ..ఆలయ నిర్మాణానికి కాలనీ పెద్దలు దైవ సంకల్పంతో ముందుకు వచ్చి ఆలయం సకాలంలో పూర్తి చేయాలని ఆలయ కమిటీని ఆదేశించారు. ప్రతి ఒక్కరిలో భక్తి భావం పెంపొందడంతోనే మానవత విలువలు పెరుగుతాయని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ…కాలనీ అభివృద్ధిలో భాగంగా దేవాలయాలు కూడా కాలనీల్లో ఉండాలని అప్పుడే ప్రజల్లో ఆధ్యాత్మికత పెంపొందుతుందని తెలిపారు. దేవాలయం నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని కాలనీ ప్రజలకు హమీ ఇచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. భక్తుల విరాళ సేకరణతోనే ఆలయాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రేమ్‌దాస్‌గౌడ్ , దేవదాస్‌గౌడ్ , టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్‌గౌడ్ ,ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.