ఎల్బీనగర్, డిసెంబర్ 12: ప్రకృతిని, పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ భావన శ్రీనివాస్ ఆధ్వర్యంలో గడ్డిఅన్నారం డివిజన్లో వేపచెట్లకు మందులను పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో ఇప్పటి వరకు మన్సూరాబాద్, నాగోలు, హస్తినాపురం, చంపాపేట, గడ్డిఅన్నారం, లింగోజిగూడ, కొత్తపేట, చైతన్యపురి డివిజన్లలోని పలు కాలనీల్లో వేపచెట్లకు మందులను పిచికారీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బిచినేపల్లి వెంకటేశ్వర్రావు, మాజీ కార్పొరేటర్లు భవానీప్రవీణ్కుమార్, రమేశ్‌ముదిరాజ్, డివిజన్ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, రమణారెడ్డి, రవిచారి, నర్సింహారావు, యాద శంకర్, విక్కి, సమతి సభ్యులు గోపాల్‌దాస్, రాము, జగన్మోహన్, నవీన్, లింగేశ్వర్గుప్తా, తదితరలు పాల్గొన్నారు.
చంపాపేట, డిసెంబర్ 12: చంపాపేట డివిజన్ పరిధిలోని మారుతీనగర్ కాలనీ సమీపంలోని శ్రీ బంధన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ముందు ఫ్లై ఓవర్ కింద రహదారి ఏర్పాటుకు కృషి చేస్తానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఆలయ చైర్మన్ జైపాల్‌రెడ్డి, మారుతీనగర్ కాలనీ అధ్యక్షుడు నర్సింహాచార్యతో కలిసి నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులతో మాట్లాడి రహదారి ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజ్‌కుమార్‌రెడ్డి, డివిజన్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర్, నాయకులు రవిముదిరాజ్, విద్యాసాగర్, గోగు శేఖర్‌రెడ్డి, మేక సుకేందర్‌రెడ్డి, కాలనీ వాసులు పురుషోత్తం రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.