Mirzapur: The Movie | భారతీయ ఓటీటీ చరిత్రలో సరికొత్త సంచలనాలు సృష్టించి, ప్రేక్షకులను విపరీతంగా అలరించిన మోస్ట్ పాపులర్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘మీర్జాపూర్’ ఇప్పుడు బిగ్ స్క్రీన్ పైకి దూసుకొస్తోంది. ఓటీటీ నుంచి నేరుగా వెండితెరపైకి అడుగుపెడుతున్న ఈ భారీ చిత్రం ‘మీర్జాపూర్: ది మూవీ’ (Mirzapur: The Movie) కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
కాగా, సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకువెళ్లేందుకు మేకర్స్ తాజాగా ఒక క్రేజీ అప్డేట్ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మోస్ట్ అవేటెడ్ ట్రైలర్ను ఆగష్టు 11న గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సోషల్ మీడియాలో అభిమానుల ఉత్సాహం తారస్థాయికి చేరింది. కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి), గుడ్డు పండిట్ (అలీ ఫజల్) మరియు అందరితో పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే మున్నా భయ్యా (దివ్యేందు) వంటి ఐకానిక్ పాత్రలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. కేవలం డిజిటల్ స్క్రీన్లకే పరిమితం కాకుండా, ఈసారి ఏకంగా వెండితెరపై పవర్-ప్యాక్డ్ యాక్షన్తో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు ఈ ప్రాంచైజీ సిద్ధమైంది. ఈ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 4న కేవలం థియేటర్లలో మాత్రమే విడుదల కానుంది.